దొంగ అతి తెలివితో చైన్ ను మింగేశాడు.. పోలీసులు ఊరికే ఉంటారా..?

దొంగ అతి తెలివితో చైన్ ను మింగేశాడు.. పోలీసులు ఊరికే ఉంటారా..?

మనం  పడుకున్నా, కూర్చున్నా కొన్నిసార్లు మనపై ఎవరు కన్నేశారో కూడా తెలియదు. దొంగలు మన వస్తువులను దొంగిలించాలనుకున్నప్పుడు వారు మనల్ని ఫాలో అవుతున్నారనే విషయాన్ని గుర్తించలేం. ఈ ఘటన బ్రెజిల్‌లోని సావోపాలోలో చోటుచేసుకుంది.  బీచ్‌లో పడుకున్న ఓ మహిళ సన్‌బాత్ చేస్తోంది.  ఆమె మెడలో నుండి గొలుసు మాయమైంది .అయితే చైన్ స్నాచింగ్ చేయడం  నేరాలు అన్ని చోట్లా జరుగుతుంటాయి.. అయితే ఈ ఘటనలో దొంగను పోలీసుులు చాకచక్యంగా పట్టుకున్నారు.మహిళ మెడలోని గొలుసును 16 ఏళ్ల బాలుడు లాక్కొని పారిపోయాడు.  ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకుడే పోలీసులకు ఫోన్ చేసి చైన్ పోయిందన్న విషయాన్ని బాధితులు తెలిపారు.  అప్పటి వరకు అక్కడున్న  16 ఏళ్ల బాలుడితో పారిపోయాడని గుర్తించారు. ఆ బాలుడిని గుర్తించిన పోలీసులు పట్టుకొని పోదా చేశారు.  చాలాసేపు వెతికినా... ఆ బాలుడి వద్ద గొలుసు లభించలేదు.  

దొంగిలించిన చైన్ ను మింగిన దొంగ 


చివరకు పోలీసులు అనుమానితులందరికీ వైద్య పరీక్షలు చేయించారు. అతనికి ఇంటెన్సివ్ టెస్ట్ జరుగుతున్నప్పుడు, ఎక్స్-రేలో ఏదో భిన్నంగా కనిపించింది. ఆ బాలుడి కడుపులో ఓ మహిళ బంగారు గొలుసు ఉంది. దీంతో పోలీసులు బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి దొంగతనం కేసు నమోదు చేశారు. బ్రెజిల్ లో డ్రగ్స్ సరఫరా, చోరీ ఘటనలు తరచూ తెరపైకి వస్తున్నా ఈ విధంగా చైన్ మింగిన ఘటన కాస్త విచిత్రమే.