వెంకన్న గుడిలో అర్ధరాత్రి దొంగ : కుక్క అరవడంతో….

వెంకన్న గుడిలో అర్ధరాత్రి దొంగ : కుక్క అరవడంతో….

హైదరాబాద్ ఓల్డ్ సిటీ సంతోష్ నగర్ లోని పురాత శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగతనానికి ట్రై చేశాడు ఓ దొంగ. దేవుడి సొమ్మునులను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు గుర్తు తెలియని దుండగుడు. రాత్రి వేళ చొరబడి వంట గదిలో ఉన్న తాళాల గుత్తిని దొంగలించి.. స్వామివారి గర్భగుడి తలుపు తీశాడు. నగలు దొంగలించాలనుకున్నాడు. స్వామివారి విగ్రహంపై ఉన్న బట్టల కింద బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో .. హుండీని పగలకొట్టడానికి ప్రయత్నించాడు.

గుడిలో ఉన్న కుక్క దుండగుడిని చూసి మొరిగింది. కుక్క అరుపులతో దుండగుడు పారిపోయాడు. స్థానికులు గమనించి.. దొంగతనానికి ప్రయత్నం జరిగిందని తెల్సుకున్నారు.

ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. స్వామివారి నగలు దొంగతనానికి గురై ఉంటే లక్షల రూపాయల్లో నష్టం జరిగేదని అన్నారు. గుడి భద్రతను పవిత్రతను కాపాడాలని భక్తులు కోరారు.