గండిపేట, వెలుగు : రాజేంద్రనగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇండ్లలో చొరబడి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్‌ఎం ఎన్‌క్లేవ్‌లోని మూడు విల్లాస్‌లోకి మంగళవారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు.
కబోర్డులో దాచిన 32 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఎన్‌క్లేవ్‌లోని మరో రెండు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో విలువైన సామగ్రి లేకపోవడంతో సామన్లను చిందరవందర పడేసి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
