
ఈ దోపిడీ చూస్తే షాక్ అవుతారు.. మైండ్ బ్లోయింగ్ రాబరీ అంటే ఇదే.. పట్ట పగలు.. జాతీయ రహదారి హైవేపై.. 50 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న గూడ్స్ లారీని.. బైక్ పై వెంబడిస్తూ.. లారీ ఎక్కి.. అందులోని సరుకును కొట్టేసి.. మళ్లీ ఎంతో చాకచక్యంగా లారీ నుంచి బైక్ పై దిగిన యాక్షన్ రాబరీ ఎపిసోడ్ ఉంది చూడండీ.. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లోనే చూసి ఉంటారు.. ఇది మాత్రం రియల్ రాబరీ.. మొత్తం దోపిడీ కెమెరాకు చిక్కి.. దేశ మొత్తం ఔరా అనిపించారు ఈ దొంగలు.
ఇప్పుడు ఆ వీడియో చూద్దామా..
ये वीडियो आगरा-मुंबई नेशनल हाईवे पर मध्यप्रदेश में शाजापुर जिले की है। बाइक सवार 3 चोर चलते ट्रक से सामान चुरा रहे हैं। हालांकि इस घटना में ऐसा भी लगता है, जैसे ट्रक ड्राइवर की मिलीभगत हो। चोरी होने तक ट्रक साइड चलता रहा। चोरी पूरी होते ही ट्रक की साइड बदल गई... pic.twitter.com/FfhIZHpJps
— Sachin Gupta (@SachinGuptaUP) May 25, 2024
మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లోని ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై ఈ దొంగతనం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. భారీ ట్రక్కుతో 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న లారీని ముగ్గురు దొంగలు బైక్ పై ఛేజ్ చేశారు. ఇందులో బైక్ నడుపుతున్న వ్యక్తి కాకుండా మరో ఇద్దరు రన్నింగ్ లోనే బైక్ పై నుండి లారీ ఈజీగా ఎక్కేశారు.
ఆ తరువాత ఆ లారీ పైన ఉన్న పసుపు కలర్ బ్యాగ్ ను కిందపడేసి మళ్లీ రన్నింగ్ లోనే లారీ దిగేసి బైక్ ఎక్కేసి ఎంచక్కా బ్యాగ్ తో ఊడాయించారు. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరగడం విశేషం. ఈ తతంగాన్నంతా వెనుక కారులో వస్తన్న ఓ వ్యక్తి ఫోన్ లో రికార్డు చేశాడు. వైరల్ గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు మైండ్ బ్లోయింగ్ రాబరీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దోపిడీలో లారీ డ్రైవర్ హస్తం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.