
శంషాబాద్, వెలుగు: ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలు బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పీఎస్పరిధిలో జరిగింది. మధురానగర్ కాలనీలో ఉండే సురేశ్ ఈ నెల 4న కుటుంబసభ్యులతో కలిసి ఊరెళ్లాడు. గురువారం అతడి ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు సురేశ్‌కు సమాచారం అందించారు. సురేశ్వచ్చి చూడగా ఇంట్లోని 2 తులాల బంగారం కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపారు.