ఆదిలాబాద్ పట్టణం రాంనగర్కాలనీలోని ఏటీఎంలో రూ.14 లక్షలు చోరీ

ఆదిలాబాద్ పట్టణం రాంనగర్కాలనీలోని ఏటీఎంలో రూ.14 లక్షలు చోరీ

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: గ్యాస్​ కట్టర్​తో ఏటీఎంను ధ్వంసం చేసిన దొంగలు రూ.14 లక్షలతో ఉడాయించారు. ఆదిలాబాద్ ​పట్టణం రాంనగర్​కాలనీలోని ఎస్​బీఐ బ్రాంచ్​ఏటీఎం సెంటర్​లో శనివారం ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు ఏటీఎం సెంటర్​లోకి చొరబడిన దుండగులు సీసీ కెమెరాలకు బ్లాక్​ స్ర్పే చేసి ఈ చోరీకి పాల్పడ్డారు. డీఎస్​పీ ఎల్.జీవన్​రెడ్డి, మావల, వన్​టౌన్​సీఐలు కె.స్వామి, సునీల్​కుమార్​ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.