పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే..

పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే..

ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ప్రజలు తమ ఇళ్లలో ప్రతిరోజు పూజలు( Pooja ) చేస్తూ ఉంటారు.అయితే నియమానుసారంగా పూజలు చేస్తే పర్వాలేదు కానీ నియమాలను తప్పించి పూజ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆ తప్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.అయితే పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మామూలుగా పూజ గదిలో( Pooja Room ) దేవత విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి.అంతకన్నా పెద్దగా అసలు ఉండకూడదు. మంత్రపుష్పం, సుప్రభాతం కూర్చొని అస్సలు చదవకూడదు. ఇలా చేస్తే మహా పాపం.శివుడికి లేదా వేరే దేవుడికి ఎవరికైనా కూడా పవళింపు సేవ( Pavalimpu Seva ) నిల్చుని చేయకూడదు.ఎప్పుడు కూర్చుని మాత్రమే చేయాలి.

పూజ చేసే సమయంలో నుదుటిపై బొట్టు లేదా విభూతి తప్పనిసరిగా ధరించాలి. అలా ధరించకుండా పూజ చేయరాదు.అంతేకాకుండా ఒక చేత్తో ఎప్పుడు నమస్కరించకూడదు. ఇది చాలా తప్పు అనీ పెద్దవారు చెబుతూ ఉంటారు.అలాగే ఈశ్వరుడికి వీపు చూపరాదు.ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షణ చేయరాదు.ఈశ్వరుడికి చేసే దీపారాధన( Deeparadhana ) పరదేవతతో సమానం కాబట్టి ఆ దీపారాధనలో పుల్లలు కానీ, అగర్ బత్తీ కానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు.పూజ సమయంలో ఈశ్వరుడు( Parameshwara ) మనకంటే ఎత్తులో ఉండాలి.అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి.మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్థాలు తినకూడదు. 

మహిళలు చేయకూడని కొన్ని పొరపాట్లు విషయానికి వస్తే మహిళలు తులసి దళాలు( Tulsi Leaves ) తుంచకూడదు. పురుషులు మాత్రమే తుంచవలెను.పౌర్ణమి, అమావాస్య నాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగన స్నానం చేసిన కూడా త్రి సంధ్యల కాలంలో, మైల రోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచినా కూడా మహాపాపం. 

మహిళలు జుట్టు విరపోసుకొని ఎప్పటికీ ఉండకూడదు.ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలా కనపడితే భర్తకి గండం. పూర్తిగా శిరో ముండనం చేసుకోకూడదు .. కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పూర్తిగా శిరో ముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదుల యందు, వ్రత దినముల యందు, శ్రాద్ధ దినముల యందు, మంగళ, శనివారముల యందు క్షురకర్మ పనికిరాదు.

మరికొన్ని ముఖ్యమైన విషయాలు

  • పూజా ద్రవ్యాలు మనకు కుడివైపున ఉండాలి
  • దీపారాధన   నేతితో చేస్తే కుడివైపున ...నూనె దీపమైతే ఎడమవైపున ఉండాలి
  • ఎడమచేత్తో ఉద్దరణె(స్పూన్) నీళ్లు తీసుకొని కుడిచేతిలో పోసుకొని ఆచమనం చేయాలి
  • ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు. మీసాలకు గడ్డానికి జలం తగులకూడదు
  • గంటను పువ్వుతో అర్చించి తరువాత మోగించాలి.
  • గంటను, శంఖాన్ని తమలపాకును ఎట్టి పరిస్థితిల్లో నేలపై ఉంచరాదు
  • పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు
  • తూర్పు, ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజ చేయాలి.
  • పూజలకు, జపానికి వినియోగించే ఆససం (పీట) అనుష్ఠానం తరువాత ఎవరికి వారే తీయాలి. ఒకరు కూర్చున్న దానిని మరొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు.
  • నైవేద్యం పెట్టేటప్పుడు శుచిగా ఉన్న పాత్రలో పెట్టాలి.  నేలపై తుడిచి ముగ్గుపెట్టి, ఆపాత్రను ఉంచాలి.
  • వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు
  • పూజ అంటే భోగములు కలిగించునదని అర్దం. పూజలో వాడేఉపచారాలను దేవతా శక్తులు గ్రహించి మనకు ఆనంద భోగాలను ఇస్తాయి
  • బహిష్టులు స్త్రీలు మసలే చోట... వారి దృష్టి పడే చోట దేవతా పూజ అనుష్ఠానం, దీపారాధన చేయకూడదు. మనకు తెలియని సూక్ష్మ జగత్తులో చాలా దుష్ప్రకంపలు జరుగుతాయని వేదాలలో కూడా చెప్పబడింది.