కరోనా గురించి ఆలోచిస్తూ.. ఆ వ్యాధిని మరవొద్దు

కరోనా గురించి ఆలోచిస్తూ.. ఆ వ్యాధిని మరవొద్దు

కరోనా కట్టడిలో పడి.. ఫ్లూను మరవొద్దు

కమ్యూనిటీ లెవెల్​లో వ్యాక్సిన్​ ఇవ్వాలంటున్న సైంటిస్టులు

జనాల నిర్లక్ష్యంతో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన

వాషింగ్టన్​: ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్​ కోసమే చూస్తోంది. కానీ, అంతకుమించిన ప్రమాదం కాచుకు కూర్చుంది. అదే ఫ్లూ! మన దేశంలో దాని ప్రభావం అంతగా లేకపోయినా.. అమెరికా, యూరప్​ దేశాలకు వణుకు పుట్టించే వైరస్​ అది. ఒక్క అమెరికాలోనే ఏటా 6 లక్షల మంది దాకా చనిపోతున్నారంటే దాని ముప్పు ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెప్పాలంటే కరోనా మరణాల కన్నా ఎక్కువే అది. యూరప్​లోనూ దాదాపు అదే పరిస్థితి. ఇప్పుడు ఆ దేశాల్లో ఫ్లూ సీజన్​ రాబోతోంది. అందుకే కరోనా గురించి ఆలోచిస్తూ ఫ్లూ ముప్పును మరిచిపోవద్దని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఫ్లూ వ్యాక్సిన్​ వేసుకోవాలని సూచిస్తున్నారు. 2018లో అమెరికా హాస్పిటళ్లలో బెడ్లు చాలక.. పార్కింగ్​ ప్లేసుల్లో టెంట్లు వేసి ఫ్లూ ట్రీట్​మెంట్​ చేసిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కరోనా కేసులు కూడా ఎక్కువున్నాయి. ఈ టైంలో ఫ్లూ కేసులు కూడా వాటికి తోడైతే హెల్త్​కేర్​ సిస్టమ్​ మీద పెద్ద ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. దాని వల్ల ఇటు కరోనా, అటు ఫ్లూతో మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కమ్యూనిటీ లెవెల్​లో ఫ్లూ వ్యాక్సినేషన్​ చేయాలని సూచిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఫ్లూ వ్యాక్సినేషన్​ ప్రోగ్రామ్​ నిర్వహించాలంటున్నారు.

నిర్లక్ష్యం వద్దు

ఫ్లూ వ్యాక్సినేషన్​పై తప్పుడు సమాచారంతో పాటు జనాల నిర్లక్ష్యమూ తోడవుతుండడంతో అమెరికాతో పాటు యూరప్​ దేశాల్లో కేసులు, మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆరు నెలలలోపు పిల్లలందరికీ ఫ్లూ వ్యాక్సిన్​ను కచ్చితంగా వేయించాలని అమెరికా సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​ సిఫార్సు చేసింది. కానీ, ఆ టార్గెట్​ మాత్రం చేరలేదు. ఇక, 18 ఏళ్లుపైబడిన వాళ్లలో 45% మందే పోయినసారి ఫ్లూ వ్యాక్సిన్​ వేసుకున్నారట. యూరప్​ దేశాల్లో 75% టార్గెట్​ పెట్టినా.. సగం కూడా అందుకోలేదు.

యూనివర్సల్​ ఫ్లూ వ్యాక్సిన్​ కావాల్సిందే

1918లో ప్రపంచాన్ని వణికించింది స్పానిష్​ ఫ్లూ మహమ్మారి. దాదాపు 5 కోట్ల మందికిపైగా బలి తీసుకుంది. మన దేశంలోనే 2 కోట్ల మందికిపైగా చనిపోయారు. అప్పటికే ఉన్న ఫ్లూలలో ఇది కొత్త రకం వైరస్​. ఆ తర్వాత 1957, 1968, 1977, 2009లలో రకరకాల చిన్నపాటి ఫ్లూ ప్యాండెమిక్​లు ప్రపంచాన్ని తిప్పలు పెట్టాయి. 2 కోట్ల నుంచి నాలుగున్నర కోట్ల మందిని చంపేశాయి. వాటికి వ్యాక్సిన్​లు వచ్చినా అన్నింటికీ వేర్వేరుగానే ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ రకం ఫ్లూ జనంపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. ఏ రకం ఫ్లూ అయినా.. ఒకే ఒక్క యూనివర్సల్​ వ్యాక్సిన్​ ఉండాలని సైంటిస్టులు చెబుతున్నారు. అలాంటి వ్యాక్సిన్​ ఒకటి వస్తే ప్యాండెమిక్​లు రాకుండా అడ్డుకోవచ్చని అంటున్నారు. తక్కువ, మీడియం ఆదాయం ఉన్న దేశాలకు సరైన టైమ్​కు వ్యాక్సిన్లు అందించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

For More News..

8 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రిక్రూట్‌‌మెంట్‌‌

దుబ్బాక ఎన్నికల్లో పోటీచేస్తే సజీవదహనం చేస్తాం

ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని ఆపలేదు