
8 మంది పిల్లలను దత్తత తీసుకుంటానని చెబుతోంది హీరోయిన్ అదితి రావు హైదరి. తనకు పిల్లలంటే ఇష్టమని.. అందుకని ఇప్పుడే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే ఉద్దేశం తనకు లేదని తెలిపిన హైదరి.. అనాధ పిల్లల్ని దత్తత తీసుకుంటానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది అదితి. “ఎప్పటి నుండో నాలో ఈ ఆలోచన ఉండగా, వచ్చే రెండేళ్ళలో నా ఆశ తప్పక నెరవేరుతుందని నమ్ముతుంది హైదరి. కుదిరితే ఎక్కువ మంది పిల్లలని దత్తత తీసుకొని వారికి విద్య సాయం కూడా చేస్తాను. దత్తత అనేది మనుషులుగా మనం చేయగలిగిన గొప్ప పని” అని అదితి రావు తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అంతరిక్షం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అదితి రావు హైదరి ..సౌత్ లోనూ పలు భాషలలో నటిస్తూ అలరిస్తుంది. చెక్క చివంత వనం( తెలుగులో నవాబ్) అనే తమిళ సినిమా ఈ అమ్మడికి మంచి విజయాన్ని అందించింది. లేటెస్ట్ గా సైకో అనే తమిళ సినిమా చేస్తుంది.