వంశీరామ్ బిల్డర్స్ పై మూడో రోజు ఐటీ సోదాలు

వంశీరామ్ బిల్డర్స్ పై మూడో రోజు ఐటీ సోదాలు

వంశీరామ్ బిల్డర్స్ పై వరుసగా మూడో రోజు ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. వంశారామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివాసంలో డిజిటల్ లాకర్లను అధికారులు తెరిచారు. ఇప్పటికే పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. స్థిరాస్తుల పత్రాలతో పాటు పలు వ్యాపార భాగస్వాముల డాక్యుమెంట్లను గుర్తించారు. వాటిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డితో పాటు ఆయన ఆస్తులపై మూడు రోజుల నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న ఆయన ఆఫీసులు, హోటళ్లు, ఇతర ఆస్తులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా పలు స్థలాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు వంశీరామ్ బిల్డర్స్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అలాగే పలు కమర్షియల్ కాంప్లెక్స్ లను కూడా నిర్మిస్తోంది. ఇందులోనూ పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో... ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.