బాలిక కేసులో ముగిసిన మైనర్ల మూడో రోజు కస్టడీ

బాలిక కేసులో ముగిసిన మైనర్ల మూడో రోజు కస్టడీ

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బాలికపై అఘాయిత్యం కేసులో మైనర్ల మూడో రోజు కస్టడీ ముగిసింది. దాదాపు 4గంటల పాటు అన్ని కోణాల్లో ప్రశ్నించిన పోలీసులు అనేక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ చెప్పిన వివరాలను మైనర్లు చెప్పిన సమాధానాలతో సరిపోల్చుకున్నట్లు సమాచారం. ఐదుగురు మైనర్లను వివిధ కోణాల్లో విచారించిన అనంతరం జువైనల్ హోంకు తరలించారు. 

ఇదిలా ఉంటే పోలీస్ కస్టడీలో మైనర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం. సాదుద్దీన్ రెచ్చగొట్టడం వల్లే అఘాయిత్యం చేసినట్లు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.  జూబ్లీహిల్స్ బాలిక కేసులో అరెస్టైన నలుగురు నిందితులను జువైనల్ కోర్టు ఈ నెల 11వ తేదీ నుంచి నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. కోర్టు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుంది. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ కస్టడీ ఆదివారంతో ముగియడంతో పోలీసులు నిన్న అతన్ని కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.