థర్డ్‌‌ హ్యాండ్‌‌ స్మోకింగ్‌‌.. ఎక్కువ రిస్క్‌‌ పిల్లలకే

థర్డ్‌‌ హ్యాండ్‌‌ స్మోకింగ్‌‌.. ఎక్కువ రిస్క్‌‌ పిల్లలకే

స్మోకింగ్ వల్ల వచ్చే నష్టాలేంటో తెలియంది కాదు. సిగరెట్‌‌లో ఉండే నికోటిన్‌‌, ఇతరత్ర కెమికల్స్‌‌ అనారోగ్యాన్ని కలిగిస్తాయి. గుండె జబ్బు– స్ట్రోక్‌‌, లంగ్‌‌ క్యాన్సర్‌‌కి కారణమవుతాయి. ప్రతీ ఏడాది కోట్ల సంఖ్యలో చావులకు కారణమవుతోంది స్మోకింగ్‌‌. అయితే  ఈ అలవాటు లేకున్నా.. స్మోక్‌‌ చేసేవాళ్ల పక్కన నిల్చుని ఆ పొగతో జబ్బుల బారినపడుతున్నారు చాలా మంది . దీనిని సెకండ్ హ్యాండ్‌‌ స్మోకింగ్ అని పిలుస్తారు. ఈ ఇండైరెక్ట్  స్మోకింగ్‌‌తో నమోదు అవుతున్న మరణాల సంఖ్య కూడా కోట్లలోనే ఉంటోంది. అయితే థర్డ్‌‌ హ్యాండ్‌‌ స్మోకింగ్‌‌ గురించి మీరెప్పుడైనా విన్నారా?..

థర్డ్‌‌ హ్యాండ్‌‌ స్మోకింగ్‌‌.. అంటే స్మోకింగ్‌‌ టైంలో వెలువడే కారకాల వల్ల కలిగే డ్యామేజ్‌‌.  సిగరెట్‌‌ పొగ, బూడిదలో ఉండే నికోటిన్‌‌, ఇతరత్ర  కెమికల్స్‌‌ ఉంటాయి. అవి శరీరం, జుట్టు, బట్టలపై పడ్డప్పుడు, లేదంటే   గాలి ద్వారా కార్పెట్స్, ఫర్నీచర్‌‌ ఇలా దేనిమీదైనా చేరినప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.  ఒక్కోసారి పడేసిన సిగరెట్ పీకల నుంచి కూడా ఈ డ్యామేజ్‌‌ జరుగుతుంది. ఈ ఎఫెక్ట్‌‌ డైరెక్ట్‌‌ స్మోకింగ్‌‌ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు పరిశోధకులు.  అందుకు కారణం కెమికల్స్ మరింత విషతుల్యం కావడమే అంటున్నారు వాళ్లు.

పిల్లలపై ఎక్కువ ఎఫెక్ట్‌‌

థర్డ్‌‌ హ్యాండ్‌‌ స్మోకింగ్‌‌ గత పదేళ్లుగా ఎక్కువగా వినిపిస్తున్న పదం. కానీ, 1950లోనే దీని గురించి మొదటిసారి డిస్కషన్‌‌ జరిగింది. సెయింట్‌‌ లూయిస్‌‌(మిస్సోరీ)లోని వాషింగ్టన్‌‌ యూనివర్సిటీ ఆఫ్‌‌ మెడిసిన్‌‌ పరిశోధకులు థర్డ్‌‌ హ్యాండ్‌‌ స్మోకింగ్‌‌ వల్ల కేన్సర్‌‌ కేసులు నమోదు కావడాన్ని గుర్తించి, ఒక రిపోర్ట్‌‌ తయారు చేశారు. 1991లో జరిగిన మరొక స్టడీలో స్మోకర్స్‌‌ ఇళ్లలో దుమ్ము ద్వారా నికోటిన్‌‌ ప్రభావం చూపెడుతుందని ఇంకొక రిపోర్ట్‌‌ను తయారు చేశారు. అయితే థర్డ్‌‌ హ్యాండ్‌‌ స్మోకింగ్‌‌ వల్ల ఎక్కువ రిస్క్‌‌ పిల్లలకే కలుగుతుందని రీసెర్చర్స్‌‌ చెబుతున్నారు. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌‌ని తగ్గిస్తుంది. ఆర్గాన్స్ పనితీరును దెబ్బతీస్తుంది. క్రమంగా  కేన్సర్‌‌కి దారికూడా తీయొచ్చని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.