వరంగల్‍ జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది..

వరంగల్‍ జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది..
  • రేపు 530 జీపీల్లో ఆఖరి పల్లెపోరు
  • ఓరుగల్లులో 564 జీపీలు, 4,846 వార్డులు
  • ఇప్పటికే 34 జీపీల్లో సర్పంచులు, 792 వార్డుల ఏకగ్రీవం
  • ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు, పోలీస్‍ సిబ్బంది 
  • షురూ అయిన క్యాండియేట్ల ప్రలోభాలు

వరంగల్‍, వెలుగు:  ఓరుగల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆఖరి విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం స్థానికపోరు జరగనుంది. ఆరు జిల్లాల్లోని కలెక్టర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

వరంగల్‍, హనుమకొండ, జనగామ జిల్లాలో పరిధిలో వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ నుంచి సీపీ సన్‍ప్రీత్‍సింగ్‍ ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్త్​ పర్యవేక్షిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‍ జిల్లాల్లో ఎస్పీలు సిబ్బంది డ్యూటీలపై ఫోకస్‍ పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

530 జీపీల్లో సర్పంచులకు బ్యాలెల్​ పోరు..

ఆఖరి విడత ఎన్నికల ప్రచారం సోమవారం ముగియడంతో ఓట్ల కోసం 17న బ్యాలెట్‍ పోరు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్‍ 6 జిల్లాల నుంచి చివరి విడతలో 564 జీపీలు ఉన్నప్పటికీ 34 చోట్ల ఏకగ్రీవాలు కావడంతో మిగతా 530 చోట్ల మాత్రమే సర్పంచ్ కోసం పోటీ ఉండనుంది. దీనికోసం 1,771 మంది రెడీ అయ్యారు. ఇక మూడో విడతలో 4,846 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, బరిలో 9,972 మంది ఉన్నారు. 

792 మంది ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకున్నా సర్పంచ్‍ బరిలో ఉన్న అభ్యర్థి ఏ పార్టీ మద్దతుదారుడనే విషయంలో క్లారిటీ ఉంది. రెండు విడతల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పార్టీలు చివరి ఎన్నికను సవాల్‍గా తీసుకున్నాయి. పెద్ద జీపీలు, జనరల్‍ కోటా రిజర్వేషన్లు ఉన్నచోట ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి మనీ, మందుతో ప్రలోభాలు మొదలు పెట్టారు.

మూడో విడత మండలాలు

  • వరంగల్‍: నర్సంపేట, ఖానాపూర్‍, చెన్నారావుపేట
  • హనుమకొండ: ఆత్మకూర్‍, దామెర, నడికుడ, శాయంపేట
  • జనగామ: దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల
  • భూపాలపల్లి: మల్హర్‍రావు, మహదేవ్‍పూర్‍, మహా ముత్తారం, కాటారం
  • ములుగు: వెంకటపురం, వాజేడు, కన్నాయిగూడెం
  • మహబూబాబాద్‍: డోర్నకల్‍, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్‍

ఎన్నికల ప్రచారంలో లీడర్లు..

నర్సంపేట: మూడో విడత ఎన్నికల ప్రచారం చివరి రోజైన సోమవారం ఆయా గ్రామాల్లో హోరెత్తించారు. పలుచోట్ల పార్టీల నుంచి మద్దతు ఇచ్చిన అభ్యర్థుల తరఫున ప్రజాప్రతినిధులు, లీడర్లు ప్రచారంలో పాల్గొని, మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. వరంగల్​ జిల్లా ఖానాపురం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్​ పార్టీ బలపర్చిన అభ్యర్థుల తరఫున నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహించగా, ఖానాపురం మండలంలో బీఆర్​ఎస్​ మద్దతు తెలిపిన అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్​రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.   

మూడో విడత ఎన్నిక బరిలో నిలిచన, ఏకగ్రీవమైన స్థానాల సంఖ్య 

 జిల్లా               జీపీలు    సర్పంచ్​బరిలో    ఏకగ్రీవాలు    వార్డులు    ఏకగ్రీవం    బరిలో

 వరంగల్‍           109                 305                          07                  946              137            1837
 హనుమకొండ    68                  230                          01                  634                 71           1424 
 జనగామ             91                  267                          03                  800              108            1632
 భూపాలపల్లి       81                  296                          03                  696              126             1347 
 ములుగు            46                   157                          01                  358                78              863
 మహబూబాబాద్‍  169               516                          19                1412              272            2869
 మొత్తం             564                1,771                         34                 4,846             792           9,972