కోవిడ్ మూడో దశ రాబోతోంది.. సిద్దంకండి

V6 Velugu Posted on May 05, 2021

దేశంలోకి కరోనావైరస్ మూడో దశ రాబోతోందని.. దాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సంసిద్దులు కావాలని కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె. విజయరాఘవన్ అన్నారు. ‘దేశంలో రోజుకు మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా మూడో వేవ్ అనివార్యమైంది’ అని ఆయన అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయరాఘవన్ మాట్లాడుతూ.. ‘కరోనా మూడవ దశ అనివార్యం. ఈ మూడో దశ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టంగా తెలియదు. ప్రస్తుత వేరియంట్‌లకు వ్యతిరేకంగా టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా కొత్త వేరియంట్లు తలెత్తుతాయి. ఇవి వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతాయి. రోగనిరోధకాలు వ్యాధి తీవ్రతను తగ్గించేవిగా లేదా పెంచేవిగా మారతాయి. అందువల్ల మూడో దశను ఎదుర్కొనేందకు సిద్ధంగా ఉండాలి’ అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,780 మంది కరోనా బారినపడి చనిపోయారు. కరోనా దేశంలోకి ఎంటరైన తర్వాత ఇదే అత్యధిక మరణాల సంఖ్య కావడం గమనార్హం.

Tagged coronavirus, corona spread, , Third Wave Coronavirus, Principal Scientific Advisor VijayRaghavan

Latest Videos

Subscribe Now

More News