వీడియో: హాస్పిటల్లో చేరిన ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీరాజ్

వీడియో: హాస్పిటల్లో చేరిన ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీరాజ్

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఎవరికైనా గుర్తొచ్చే పేరు కమెడియన్ పృథ్వీరాజ్. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గత 10 రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. దాంతో ఆయన నాలుగు రోజుల కింద కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆ టెస్టుల్లో కరోనా నెగిటివ్ గా వచ్చింది. అయితే సోమవారం జ్వరం తీవ్రమవడంతో.. వైద్యులు ఆయనకు 15 రోజుల క్వారంటైన్ సూచించారు. దాంతో ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. వైద్యుల సూచన మేరకే.. తాను ఆస్పత్రిలో చేరానని.. ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి దయ వల్ల బాగానే ఉన్నానని ఆయన ఆ వీడియోలో తెలిపారు.

పృథ్వీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆయనకు ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవి లభించింది. అయితే ఆయనపై వచ్చిన కొన్ని ఆరోపణల వల్ల ఆ పదవికి రాజీనామా చేశారు.

For More News..

విజయవాడ కోర్టు సంచలన తీర్పు.. చిన్నారి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

రెస్టారెంట్ వినూత్న ప్రయోగం.. కోవిడ్ కర్రీ, మాస్క్ నాన్స్

ముంబైలో బతకడం సేఫ్ కాదు.. మాజీ సీఎం భార్య