తిరువీర్ ఓ.. సుకుమారి మూవీ టీజర్ రిలీజ్..

తిరువీర్ ఓ.. సుకుమారి మూవీ టీజర్ రిలీజ్..

తిరువీర్, ఐశ్వర్య రాజేష్​ జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. శనివారం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.   ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో  తిరువీర్ మాట్లాడుతూ ‘ఫ్యామిలీస్, పిల్లలు కలిసి చూసిన సినిమా చాలాకాలం గుర్తుండిపోతుంది. అలాంటి సినిమాలకు లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి విజయమే ఈ సినిమాకు దక్కుతుందని నమ్ముతున్నాం. 

ఐశ్వర్యతో   కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది.  ఈ చిత్రంలో కథతోపాటు కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కచ్చితంగా ప్రేక్షకులు మంచి సినిమా చూశామని ఫీల్ అవుతారు’ అని అన్నాడు.  ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ‘హీరోయిన్‌‌‌‌‌‌‌‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుందనే కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రాలేదనుకుంటాను.  

ఈ కథ విన్న తర్వాత నిజంగా ఇలాంటి వాళ్లు ఉంటారేమో అనిపించింది. కథతో చాలా కనెక్ట్ అయ్యాను’ అని చెప్పింది. ఈ చిత్రం అందరినీ తప్పకుండా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుందని దర్శకుడు భరత్, నిర్మాత మహేశ్వర్ రెడ్డి అన్నారు. నటులు జీవన్, 
గవి రెడ్డి, డీవోపీ కుషేందర్ పాల్గొన్నారు.