అపార్ట్ మెంట్ అడ్వాన్స్ రూ.25 లక్షలా.. కొత్తదే వస్తుంది కదయ్యా..

అపార్ట్ మెంట్ అడ్వాన్స్ రూ.25 లక్షలా.. కొత్తదే వస్తుంది కదయ్యా..

బెంగళూరులో ఫ్లాట్ దొరకడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెక్ సిటీలోని రియల్ ఎస్టేట్ మీ జేబుకు చిల్లులు పెడుతుందనే వాస్తవం ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్ హల్ చల్ చేస్తోంది. తేజస్వి శ్రీవాస్తవ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వార్త.. బెంగుళూరులోని ఒక ఫ్లాట్ గురించి చెప్తోంది. ఇంటి కోసం వెతుకుతున్న సమయంలో NoBroker.com తనకు HSR లేఅవుట్‌లో ఉన్న ఈ ఫ్లాట్ ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. అది తేజస్వి దృష్టిని ఆకర్షించింది. లిస్టింగ్‌లో పేర్కొన్న సెక్యూరిటీ డిపాజిట్ చూసి ఆమె షాక్ గురయ్యానంటూ పోస్టులో తెలిపింది. అంతే కాదు ఆ ఇంటికి సంబంధించిన స్ర్కీన్ షాట్ ను, అందులోని డిపాజిట్ ధరను చూపిస్తూ అప్ లోడ్ చేసింది.

కేవలం డిపాజిట్ అమౌంటే రూ.25 లక్షలయితే.. మరి మొత్తం అద్దె ఎంత ఆలోచిస్తున్నారా. ఆ విషయానికొస్తే నెలకు అక్షరాల రూ.2 లక్షల 50వేలని కూడా ఈ పోస్టులో కనిపిస్తోంది. ఈ పోస్టుతో పాటు తేజస్వీ.. ఓ ఇంట్రస్టింగ్ క్యాప్షన్ ను కూడా జత చేసింది. వారు మరో ఆప్షన్ ను కూడా జత చేయాలి. అదేంటంటే కిడ్నీ డొనేషన్ కోసం అప్లై చేసుకోండి అని.. అంటూ ఆమె చమత్కరిస్తూ రాసుకువచ్చింది. ఇంత పెడ్తే వచ్చేది ఎంత పెద్ద ఇల్లో అనుకుంటున్నారేమో.. కేవలం 4bhk ఫ్లాట్‌ అంట. నిజంగా ఇది విస్మయం కలిగించే విషయమే కదూ అని ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఈ ట్వీట్ పై స్పందించిన కొందరు యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

They should add an option:
Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF

— Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023