Family : పిల్లల మనసు నొప్పించకుండా.. ఇలా కూడా చెప్పొచ్చు

Family : పిల్లల మనసు నొప్పించకుండా.. ఇలా కూడా చెప్పొచ్చు

పిల్లలు ఒక్కోసారి మాట వినరు. ఫలానా పని చేయొద్దని ఎంత చెప్పినా వినిపించుకోరు. అలాంటప్పుడు తల్లిదండ్రులు వాళ్లని కోప్పడతారు. దాంతో కొందరు పిల్లలు మూడీగా ఉండి, ఏం తినరు. ఎవరితోనూ మాట్లాడరు. అలాగని వాళ్లని ఒంటరిగా వదిలేయకూడదు. పిల్లలతో మాట్లాడాలి. 

* పిల్లల్ని తిట్టినా, కోప్పడినా ఆ వెంటనే వాళ్లని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. ఫలానా పని ఎందుకు చేయకూడదో వివరంగా చెప్తే, పిల్లలు అర్థం చేసుకుంటారు. 

* తమ బాధను తల్లిదండ్రులతో చెప్పుకునే ఫ్రీడమన్ను పిల్లలకు ఇవ్వాలి. వాళ్లని మూడీ ఫీలింగ్ నుంచి బయటపడేయడానికి పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం. 

* పిల్లలతో గడిపేందుకు రోజూ కొంచెం టైమ్ ఇవ్వాలి. వాళ్లతో గేమ్స్ ఆడడం, పజిల్స్ సాల్వింగ్ లో సాయం చేయడం ద్వారా తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధం బలపడుతుంది. 

* పిల్లలు ఒకే పొరపాటును రిపీట్ చేయకుండా తల్లిదండ్రులు గమనించాలి. తప్పొప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం అలవాటు చేయాలి.