30 మందిని కాపాడిన కుక్క..అదే ప్రమాదంలో మృతి

30 మందిని కాపాడిన కుక్క..అదే ప్రమాదంలో మృతి

విశ్వాసానికి మారుపేరంటే కుక్కలే. ఒక్కసారి తిండి పెడితే చాలు యజమాని కోసం ప్రాణం కూడా ఇస్తాయి . ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం దీనికి సజీవ సాక్ష్యం.  బాందా నగరంలోని ఓ అపార్ట్ మెంట్ లో అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది . అక్కడే స్తంభానికి కట్టేసి ఉన్నకుక్క గాఢ నిద్రలో ఉన్న వాళ్లందరూ మేల్కొనే వరకూ అరుస్తూనే ఉంది. దాదాపు 30 మంది తమ గదుల్లోంచి బయటికొచ్చేశారు. ఈలోగా బాగా వ్యాపించిన మంటలు వంట గదిలోని గ్యాస్ సిలిండర్ ను చేరడంతో పెద్ద పేలుడు సంభవించింది .అందర్నీ కాపాడిన కుక్క తనువు చాలించింది . అంతెత్తున లేచిన అగ్ని కీలలకు ఆహుతైపోయింది . ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ ‘‘ఆ కుక్క గట్టిగా అరుస్తూ అందర్నీఅప్రమత్తం చేసింది . దీంతో అందరం బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాం.  కానీ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేలుడు ధాటికి అది చనిపోయింది ’’ అని చెప్పారు. తమకు పునర్జన్మనిచ్చిన ఆ మూగజీవి త్యాగానికి కొందరు కన్నీ ళ్లు పెట్టుకున్నారు .