ఈ ఎన్నికలు 25 ఏళ్ల రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి : మోడీ

ఈ ఎన్నికలు 25 ఏళ్ల రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి : మోడీ

గుజరాత్‌లో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బనస్కాంత జిల్లాలోని పాలన్‌పూర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యే అవుతారో, ఎవరి ప్రభుత్వం వస్తుందో కాదు.. వచ్చే 25 ఏళ్ల గుజరాత్ భవితవ్యాన్ని ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాల లీగ్‌లో గుజరాత్‌ను చేర్చేందుకు తాను ప్రయత్నాలు చేస్తున్నానన్నారు.

గుజరాత్‌లో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు మీ మద్దతు అవసరమని మోడీ అన్నారు.  తాను ఇక్కడే పెరిగానని.. కాబట్టి మీ సమస్యలను తనకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బనస్కాంతలోని అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు  విజ్ఞప్తి చేశారు.

బనస్కాంత జిల్లాలో డిసెంబరు 5న రెండో దశలో ఓటింగ్ జరగనుంది. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా, బీజేపీని ఈ సారి అయిన గద్దే దించాలని  కాంగ్రెస్, ఆప్ ప్రయత్నాలు చేస్తున్నాయి.