ఈ ప్రభుత్వం రెండేళ్లలో పడిపోద్ది

ఈ ప్రభుత్వం రెండేళ్లలో పడిపోద్ది
  • పార్టీలో అందరూ అసంతృప్తితో ఉన్నరు: రాములు నాయక్

‘టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలంతా అసంతృప్తితో ఉన్నరు. రెండేళ్లలో ఈ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఆ పార్టీ ఓటమి తర్వాత మరింత అసంతృప్తి బయటపడుతుంది’ అని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్​అన్నారు. గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే సంతృప్తిగా ఉందన్నారు. ఆ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు నార్కో అనాలసిస్ టెస్టులు చేస్తే విషయం బయటపడుతుందని చెప్పారు. ఈ ఎన్నికలు ధనబలానికి, ప్రజాబలానికి మధ్య జరుగుతున్నాయని, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ప్రజాస్వామ్యానికి, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికి లాభమని అన్నారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆలోచించి మాట్లాడాలన్నారు. ఓటమి భయంతోనే గ్రామానికో ఎమ్మెల్యేను ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా నియమించారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ​ప్రచారానికి వెళ్లిన వెంటనే హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో కోడి బొక్కలు, క్వార్టర్‌‌‌‌‌‌‌‌ సీసాలు మొదలవుతాయని కామెంట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఎలక్షన్లు, కలెక్షన్లతోనే టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ బతికిందని, ఈ సారి భయపెట్టి గెలవాలనుకుంటోందని ఆరోపించారు.