తల్లీ నీకు దండం : ఇది పూల జడ కాదు.. పటాకుల జడ.. కొప్పుకు బాంబులు చుట్టింది

తల్లీ నీకు దండం : ఇది పూల జడ కాదు.. పటాకుల జడ.. కొప్పుకు బాంబులు చుట్టింది

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఓ వీడియో పటాకులతో హెయిర్‌స్టైల్ ఎలా చేసుకోవచ్చో వివరించింది. దీపావళి వేడుకల సందర్భంగా ఈ హెయిర్ స్టైల్ విచిత్రంగా అనిపిస్తోంది. ఇది ఒక మహిళ జుట్టుకు జోడించిన అనేక పటాకులను చూపించింది. ఆమె పొడవాటి జుట్టు రాకెట్లు, సుట్లీ బాంబులు, చక్రి, రోప్ చైన్ క్రాకర్లను ధరించింది.  

ఆమె జుట్టుకు అమర్చిన రాకెట్ల గుత్తిని చూపించడంతో ఈ వీడియో ప్రారంభమైంది. ఆ తర్వాత హెయిర్ స్టైలిస్ట్ ఆమె జుట్టుకు మరిన్ని బాణాసంచా జోడించడం జరిగింది. కొన్ని విగ్‌లు లేదా ఎక్స్‌టెన్షన్‌లు కూడా ఇందులో ఉపయోగించబడ్డాయి. ఈ వైరల్ దీపావళి హెయిర్‌స్టైల్ వెనుక కమల్ అండ్ రిషవ్ అనే హెయిర్ ఆర్టిస్టులు ఉన్నట్లు సమాచారం. పండుగ సీజన్‌కు బాగా సరిపోయే ఈ హెయిర్‌స్టైల్ గురించి ఇతరులకు తెలియజేయడానికి ఈ ఇద్దరూ రీల్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వచ్చే దీపావళికి ఈ ప్లాన్ చేయాలని,  అగ్గిపుల్లని ఆమె జుట్టు వైపు విసిరితే అది ఎంత ప్రమాదకరంగా పరిణమించగలదో అని కొందరు భయపడ్డారు. “ఒక అగ్గిపుల్ల చాలు” అని ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ వ్యాఖ్యానించారు.