వర్క్ ఫ్రమ్ హోంలో ఇది తప్పనిసరి..!

వర్క్ ఫ్రమ్ హోంలో ఇది తప్పనిసరి..!

బీయింగ్ ప్రజెంట్‌‌ అనేది ‘పని మీ టాప్‌‌ ప్రయారిటీ’ అనే విషయాన్ని మేనేజ్‌‌మెంట్ దృష్టికి తీసుకెళ్తుంది. ‘ఈ కంపెనీలో నేను పని చేస్తున్నాను. ఈ పనిని నేను చేయగలను. ఈ టీంను సమర్థవంతంగా నేను లీడ్‌‌ చేయగలను’.. ఇలా ఎన్నో విషయాల్ని చెప్తుంది. అదే ఫిజికల్‌‌ ప్రజెన్స్‌‌ లేకుండా.. అంటే  వర్క్‌‌ఫ్రమ్‌‌ హోం, ఫ్రీలాన్స్‌‌ లాంటి సర్వీసులు అందించినప్పుడు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ టైంలో టెక్నాలజీని ఉపయోగించక తప్పదు. కానీ, దానిని పరిమితులతో వాడుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌.

వేల్చ్‌‌ ఫిలాసఫీ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆరువేల మంది ఉద్యోగులపై ఒక సర్వే జరిగింది.  ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో టీమ్‌‌మేట్స్‌‌, తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. అంతేకాదు వాళ్ల మధ్య కనెక్షన్‌‌ దెబ్బతింటోందని సర్వేలో వెల్లడైంది. ఒకరికి ఒకరు పరిచయం లేకపోవడం, నమ్మకం లేకపోవడమే ఈ సమస్యలన్నింటికీ కారణం. అలాంటప్పుడు  టెక్నాలజీని ఉపయోగించడం కంటే పర్సనల్‌‌గా వాళ్లను కలవడం, ఎంప్లాయిస్‌‌ను ఒకరితో ఒకరు కాంటాక్ట్‌‌ అయ్యేలా చూసుకోవడం మేనేజ్‌‌మెంట్‌‌ బాధ్యత. ఇందుకోసం మీటింగ్‌‌లను వేదికగా చేసుకోవాలి.

ఆ సందర్భాల్లోనూ నేరుగా విషయంలోకి వెళ్లడం
కంటే.. వాళ్లకంటూ కొద్దిగా టైం కేటాయించాలి. ఈ ఇంటరాక్షన్‌‌ వల్ల వాళ్ల మధ్య ఉన్న గ్యాప్‌‌ తగ్గుతుంది. మెయిల్స్‌‌ పెట్టినప్పుడు  గుడ్‌‌ మార్నింగ్, గుడ్‌‌  నైట్‌‌ లాంటి  చిన్న చిన్న పలకరింపుల వల్ల కో–వర్కర్స్‌‌ మధ్య రిలేషన్‌‌షిప్‌‌ డెవలప్‌‌ అవుతుంది.  టెక్నాలజీ కంటే మనుషులుగా క్వాలిటీ రిలేషన్‌‌షిప్‌‌కి ప్రయారిటీ ఇవ్వడం వల్ల స్కిల్స్‌‌ పెరగడంతో పాటు కెరీర్‌‌లోనూ ఎదుగుదల ఉంటుంది.