తప్పుడు టైమ్లో తీసుకున్న.. తప్పుడు నిర్ణయం ఇది.. ఈయూ, ఇండియా ట్రేడ్ డీల్పై అమెరికా విమర్శలు

తప్పుడు టైమ్లో తీసుకున్న.. తప్పుడు నిర్ణయం ఇది.. ఈయూ, ఇండియా ట్రేడ్ డీల్పై అమెరికా విమర్శలు

వాషింగ్టన్: ఈయూ, ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా యూరప్.. తనపై తాను యుద్ధం ప్రకటించుకున్నట్లు ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ విమర్శించారు. ‘‘రష్యా నుంచి ఇండియా క్రూడాయిల్ కొంటున్నది. దాన్ని రిఫైన్ చేసి యూరప్​కు  అమ్ముతున్నది. యూరప్ దేశాలు దాన్ని కొనడంతో పరోక్షంగా ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయి’’అని తెలిపారు.

 ఈయూతో ఇండియా ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికాకు నచ్చలేదన్నారు. రష్యా నుంచి క్రూడాయిల్​ కొంటున్నందుకు ఇండియాపై అదనంగా 25శాతం టారిఫ్ వేశామని గుర్తు చేశారు. ‘‘తప్పుడు టైమ్​లో తీసుకున్న తప్పుడు నిర్ణయం ఇది. ఇండియాతో ఇంత కంటే మంచి డీల్ కుదుర్చుకుందామనుకున్నం. 

కానీ.. అమెరికాను కాదని.. ఈయూతో ఒప్పందం చేసుకోవడం కరెక్ట్ కాదు’’అని స్కాట్ బెసెంట్ తెలిపారు. రష్యా ఇంధన వాణిజ్యాన్ని దెబ్బతీసేందుకు తాము ప్రయత్నిస్తుంటే, యూరప్ మాత్రం అంతర్జాతీయ చమురు వాణిజ్యంలోని లొసుగుల ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నదని మండిపడ్డారు.