ధోని ఫ్యూచర్ పై సీఎస్కే క్లారిటీ

V6 Velugu Posted on Apr 08, 2021

చెన్నై: అంతర్జాతయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీకి ఐపీఎల్ పద్నాలుగో సీజన్ చివరిది కానుందని గాసిప్స్ గుప్పుమంటున్నాయి. వీటికి అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ధోని మరికొన్ని సీజన్లు ఆడతాడని భావిస్తున్నామని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. 'ఈ సీజన్ ధోనీకి ఆఖరిది అవుతుందని నేను అనుకోవట్లే. ఇది నేను వ్యక్తిగతంగా చెబుతున్నా. మా జట్టులో ఉన్న ప్లేయర్లు మరికొన్నాళ్లు ఐపీఎల్ లో కొనసాగుతారని ఆశిస్తున్నాం. రైనా మళ్లీ టీమ్ తో చేరడం మంచి విషయం. మేం ఓ కుటుంబంలా ముందుకు సాగుతాం' అని విశ్వనాథన్ పేర్కొన్నారు.

Tagged retirement, ipl 2021, MS Dhoni, Chennai Super Kings, suresh raina, Kasi Viswanathan

More News