కొత్త కారును గాడిదలతో కట్టి ఊరేగింపు.. హ్యూందాయ్​ కార్ల కంపెనీపై నిరసన

కొత్త కారును గాడిదలతో కట్టి ఊరేగింపు.. హ్యూందాయ్​ కార్ల కంపెనీపై నిరసన

లక్షల డబ్బు పోసి కొన్న లగ్జరీ కారు రోజుల వ్యవధిలోనే మొరాయించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కారు యజమాని గాడిదలతో వీధుల్లో ఊరేగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌కు సుందర్‌వాస్‌ ప్రాంతానికి చెందిన మద్దిలోని రామ్‌జీ హ్యుందాయ్ షోరూమ్ నుంచి రెండు నెలల క్రితం శంకర్‌లాల్ అనే వ్యక్తి రూ.17 లక్షలతో హ్యుందాయ్ కారును కొనుగోలు చేశాడు. అయితే కొద్ది రోజుల్లోనే కారులో సాంకేతిక సమస్య తలెత్తి.. కారు ఆగిపోయింది. దీనిపై శంకర్‌లాల్ సర్వీస్‌ సెంటర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. బ్యాటరీ రన్‌ డౌన్‌ కారణంగా సమస్య తలెత్తిందని, కొద్ది సేపటికే మళ్లీ కారు స్టార్ట్‌ అవుతుందని సూచించారు. అయినా పలుమార్లు కారు ఆగిపోతుండటంతో షోరూం డీలర్‌ను సంప్రదించి తనగోడు విన్నవించాడు. వారు కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు.

భారతీయులతో చెలగాటమాడడం ఎంత కష్టమో ప్రపంచానికి తెలుసు. కానీ భారతదేశంలోని సాధారణ పౌరుడికి కోపం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. తాజాగా రాజస్థాన్​కు చెందిన వ్యక్తి హ్యూందాయ్​ కార్ల కంపెనీపై నిరసన తెలిపాడు.  ఆ వ్యక్తి తన కారును గాడిదకు కట్టి లాగాడు . దీనికి సంబందించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది. ఉదయపూర్‌లోని సుందర్‌వాస్ ప్రాంతంలో నివసించే రాజ్ కుమార్,   తన మామ శంకర్‌లాల్ ఉదయపూర్‌లోని మద్రి ఇండస్ట్రియల్ ఏరియా నుండి రూ. 17 లక్షల విలువైన కారును కొనుగోలు చేశారు. .

కొత్త కారు పరిస్థితి దిగజారింది!

కారులో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా, ఆ వ్యక్తి సర్వీస్ సెంటర్‌కు ఫిర్యాదు చేశాడు. కానీ ఆ  కంపెనీ కారును అమ్మిన తర్వాత సర్వీస్​ చేయడంలో అలసత్వం చూపింది.  . పలుమార్లు డీలర్‌కు  తన సమస్యలను పరిష్కరించాలని ...  ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. కారును కూడా రెండుసార్లు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లినా తరచు వాహనం నిలిచిపోతుండడంతో పరిష్కారం లభించలేదు.కొద్ది రోజుల క్రితం తన ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని రాజ్ కుమార్ చెప్పాడు. ఆ సమయంలో కారు పలుమార్లు ఆగిపోవడంతో మళ్లీ మళ్లీ నెట్టాల్సి వచ్చింది. అప్పుడు అతను సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేసాడు, అయితే వారు కారు యొక్క బ్యాటరీ రన్ డౌన్ కారణంగా సమస్య ఉందని చెప్పారు. తర్వాత కొంత దూరం వరకు కారు నడపడం ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. అయితే, ఇది జరగలేదు. తర్వాత రాజ్ కుమార్ , అతని మామ  కారును షోరూమ్‌కి ఇచ్చేయాలని  నిర్ణయించుకున్నారు. కంపెనీ చేసే బ్యాడ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ గురించి అందరికీ చెప్పేందుకు గాడిద సాయంతో కారుని షోరూమ్ కు తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. కారును గాడిదకు కట్టి, దాని సహాయంతో షోరూమ్‌కు తీసుకెళ్లారు. 

వినూత్నంగా నిరసన

దీంతోకారును తిరిగి షోరూంకు అప్పగించి, తన సొమ్మును తనకివ్వాలని డిమాండ్‌ చేశాడు. అంతేకాకుండా సేల్స్‌ తర్వాత కస్టమర్‌లను పట్టించుకోని సదరు కంపెనీ తీరును అందరికీ చెప్పేందుకు వినూత్నంగా ప్రచారం చేశాడు. వెంటనే రెండు గాడిదలను తీసుకుని కారుకు కట్టి దాన్ని రోడ్డుపై ఊరేగిస్తూ, భాజాభజంత్రీలతో షోరూంకు తీసుకెళ్లాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇండియన్స్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’, ‘నిర్లక్ష్యంగా వ్యవహరించే షోరూంలకు ఇది మంచి గుణపాఠం’, ‘హ్యుందయ్‌ వరస్ట్‌ కంపెనీ.. నేను కూడా ఓ కారు కొని చాలా ఇబ్బందిపడ్డాను’ అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు