ఈ సినిమా త్రివేణీ సంగమంలా అనిపించింది : మెగాస్టార్ చిరంజీవి

ఈ సినిమా త్రివేణీ సంగమంలా అనిపించింది : మెగాస్టార్ చిరంజీవి

చాలా రోజుల తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, 'రంగమార్తాండ' అనే అద్భుతమైన చిత్రాన్ని అందించారు. బ్రహ్మనందం, ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా లాంటి తారలు నటించిన ఈ చిత్రానికి అంతటా మంచి టాక్ వస్తోంది. మరాఠీలో సంచలన విజయం సాధించిన 'నట సామ్రాట్' కు రిమేక్ గా వచ్చిన ఈ సినిమా మార్చి 22న విడుదలైంది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ నటీనటులను పొగడకుండా ఉండలేకపోతున్నారు. సినీ ప్రముఖులు సైతం మూవీ స్టోరీపై, యాక్టర్స్ నటనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

తాజాగా 'రంగమార్తాండ' మూవీని చూసిన మెగాస్టార్ చిరంజీవి..  రీసెంట్ డేస్ లో వచ్చి మంచి సినిమాల్లో ఇదొకటన్నారు. ప్రతి ఆర్టిస్ట్ కీ తన జీవితాన్ని కళ్ల ముందు చూస్తున్నట్టనిపిస్తుందని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఈ చిత్రం త్రివేణీ సంగమంలా అనిపించిందని, కృష్ణవంశీ లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాష్ రాజ్ లాంటి ఉత్తమ జాతీయ నటుడు, ఒక హాస్య బ్రహ్మానందంల కలయిక, వారి పనితనం, నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని చిరు తెలిపారు.

ఇంత ఇంటెన్సిటీ ఉన్న ఓ అనూహ్యమైన పాత్రను బ్రహ్మానందం చేయడం ఇదే తొలిసారి అని, సెకండాఫ్ మొత్తం అప్రయత్నంగానే కళ్లు నీళ్లతో నిండిపోయాయన్నారు. ఓ కంప్లీట్ ఎమోషన్ జర్నీ అయిన ఇలాంటి మూవీస్ ని అందరూ చూసి ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ఇలాంటి రసవత్తరమైన సినిమా తీసిన నటీనటులందరికీ మెగాస్టార్ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 
https://twitter.com/KChiruTweets/status/1639470392627859456