
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ వచ్చాయి. కొత్త ప్లాన్స్లో హాట్స్టార్, డిస్నీ సబ్ స్క్రిప్షన్, 5GB అన్లిమిటెడ్ డేటాని ఫ్రీగా ఇస్తోంది ఎయిర్టెల్. ఇందుకోసం మీరు చేయాల్సింది కేవలం రూ. 999 ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవడమే.మరొకటి 869 రూపాయల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్. ఇది కస్టమర్లకు ఉచితంగా డిస్నీ, హాట్స్టార్ సబ్ స్క్రిప్షన్తో వస్తోంది.
ఎయిర్టెల్ ఇటీవల కాలంలో నెట్ఫ్లిక్స్ బండిల్ ప్లాన్ను ప్రకటించింది. దీని తర్వాత భారత్లో ప్రధాన టెలికం ప్లేయర్ అయిన ఎయిర్ టెల్.. రెండు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్లు హాట్ స్టార్ అన్ లిమిటెడ్ 5G డేటాతోపాటు మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది.
ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 839.. చెల్లుబాటు కాల 84 రోజులు. దీనికి కొనసాగింపుగా ఈ కొత్త ప్లాన్ రూ. 869ను ప్రారంబించింది ఎయిర్ టెల్.
రూ. 869 ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు:
- కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లో డిస్నీ+హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా యాక్సెస్ ఉంటుంది.
- ఈ సబ్ స్క్రిప్షన్ మూడు నెలల పాటు కొనసాగుతుంది.
- వినియోగదారులు స్మార్ట్ ఫోన్లతో మాత్రమే అప్లికేషన్లను యాక్సెస్ చేయడానికి వీలుంటుంది.
- ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ ఎంఎస్ లు చేసుకోవచ్చు.
- ఈ ప్లాన్ 84 రోజుల కాలపరిమితి
- ఇది మూడు నెలల ఉచిత అపోలో 24/7 సర్కిల్ తో వస్తుంది
- ఉచితంగా Wynk సంగీతం, హాలో ట్యూన్స్ పొందొచ్చు.
ఎయిర్ టెల్ దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటి.. దేశవ్యాప్తంగా 5జి కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చిన మొదటి కంపెనీ.. రెండోది జియో.. ఇది కూడా ప్రీపెయిడ్ ప్లాన్ తో వస్తుంది. డిస్నీ+ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ ను ఉచితంగా అందిస్తున్నాయి. ఆలస్యమెందుకు.. చెక్ ఇట్..