డిసెంబర్ 20న లయోలా అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సీఎం రేవంత్

డిసెంబర్ 20న లయోలా అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సీఎం రేవంత్

అల్వాల్, వెలుగు: ఈ నెల 20న లయోలా అకాడమీలో జరుగనున్న గోల్డెన్ జూబ్లీ వేడుకలకు చీఫ్​ గెస్ట్​గా సీఎం రేవంత్​రెడ్డి హాజరు కానున్నారని అకాడమీ యాజమాన్యం తెలిపింది. గురువారం అకాడమీ సొసైటీ చైర్మన్​ రెవరెండ్​ ఫాదర్​ అమర్​రావు మీడియాతో మాట్లాడారు. లయోలా అకాడమీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

సీఎం రేవంత్​రెడ్డితో పాటు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరవుతారని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో లయోలా అకాడమీ కరస్పాండెంట్ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్, ప్రిన్సిపాల్ ఫాదర్ డాక్టర్ బుచ్చిబాబు, జోసెఫ్ కుమార్, ట్రెజరర్ సుధాకర్, ఫాదర్అరుణ్, జ్యోతి, పీటర్, ఫాదర్ తామస్ 
తదితరులు పాల్గొన్నారు.