- టీజీసీహెచ్ఈ చైర్మన్‌తో నార్త్ ఈస్టర్న్ వర్సిటీ టీమ్ భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్టార్టప్ కల్చర్‌ను మరింత పెంచేందుకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) చర్యలు ప్రారంభించింది. దీంట్లో భాగంగా టీజీసీహెచ్ఈ ఆఫీసులో గురువారం
ఎంట్రప్రెన్యూర్ షిప్లో అమెరికాలో టాప్-10లో ఉన్న బోస్టన్ నార్త్ ఈస్టర్న్ వర్సిటీ ప్రతినిధులు ప్రొఫెసర్ గ్రెగరీ కొలియర్, క్రిష్ నంగెగడ్డతో కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా స్కిల్ డెవలప్ మెంట్ కోసం, విదేశీ విద్యను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను చైర్మన్ బాలకిష్టారెడ్డి వారికి వివరించారు. రాష్ట్రంలో ‘గ్లోబల్ వెంచర్ ఎడ్యుకేషన్’ అమలుకు ఆ వర్సిటీ టీమ్ కీలక ప్రపోజల్స్ పెట్టింది.
