'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' సాంగ్ ను రీక్రియేట్ చేసిన సిస్టర్స్

'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' సాంగ్ ను రీక్రియేట్ చేసిన సిస్టర్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన RRR  బాక్సీఫీస్ ను బద్దలు కొట్టి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి క్రియేట్ చేసిన మెస్మరైజింగ్ ఫిల్మ్ భారతీయ సినిమాను మరోసారి టాప్ లో నిలబెట్టారు. సినిమా మాత్రమే కాదు, ఆ మూవీలోని పాటలు కూడా చార్ట్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి, ముఖ్యంగా పెప్పీ డ్యాన్స్ ట్రాక్ నాటు నాటు సాంగ్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. పాటకు తగ్గట్టు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించిన స్మూత్ కొరియోగ్రఫీని ఎవరు మర్చిపోలేరు! అయితే ఇప్పుడు, YouTubeలో రికార్డు సృష్టించేందుకు రిఫ్రెషింగ్ డ్యాన్స్ తో వచ్చిన ఇద్దరు సిస్టర్స్ ట్రెండింగ్ లో నిలిచారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి  ఫిమేల్ వర్షన్ ట్రాక్ సాంగ్ కు ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు డ్యాన్స్ చేస్తూ, వాళ్లే మ్యూజిక్ వాయిస్తూ సాంగ్ ను రీ క్రియేట్ చేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో డ్యాన్స్ చేసే  వీరి పేర్లు అంటారా, అంకిత. ఇక వీరు చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన వారంతా అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మే 25న విడుదలై సంచలన విజయం సాధించింది. రూ.450కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. రూ.1150కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.  ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల్లోనూ ఎక్కువ రోజులు నెంబర్‌ వన్‌ స్లాట్‌లో స్ట్రీమింగ్‌ అయిన చిత్రంగానూ ఈ మూవీ రికార్డు క్రియేట్‌ చేసింది.