పునీత్‌ది చనిపోయే వయస్సు కాదు.. జీర్ణించుకోలేకపోతున్నా

పునీత్‌ది చనిపోయే వయస్సు కాదు.. జీర్ణించుకోలేకపోతున్నా

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ మరణం బాధించిందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పునీత్ మరణం కలచి వేసిందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తిని క్రూరమైన విధి మన నుంచి దూరం చేసిందని ప్రధాని ట్వీట్ చేశారు. పునీత్ మృతికి సినీ రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు సంతాపం తెలిపారు.  పునీత్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. పునీత్ ది చనిపోయే వయస్సు కాదన్నారు. చిన్న వయసులో రాజ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా బాధించిందన్నారు. రాజ్ కుమార్ మృతి కన్నడ సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. 

కన్నడ సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించారు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై. హాస్పిటల్ కు వెళ్లిన ఆయన.. రాజ్ కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు. మాజీ సీఎంలు యడియూరప్ప, కుమారస్వామి హాస్పిటల్ కు వెళ్లి రాజ్ కుమార్ కుటుంసభ్యులతో మాట్లాడారు. కన్నడ సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయిందన్నారు.