రూ.7వేలకు మెుదటి జాబ్.. బెంగళూరు-నోయిడాల్లో అపార్ట్మెంట్స్, ఏం ఆర్థిక ప్లానింగ్ గురూ నీది..!

రూ.7వేలకు మెుదటి జాబ్.. బెంగళూరు-నోయిడాల్లో అపార్ట్మెంట్స్, ఏం ఆర్థిక ప్లానింగ్ గురూ నీది..!

ఒక మధ్యతరగతి ఉద్యోగి తన 12 ఏళ్ల ఉద్యోగ ప్రయాణాన్ని రెడిట్ వేధికగా పంచుకున్నాడు. తాను తొలుత రూ.7వేల వేతనంతో ఉద్యోగం స్టార్ట్ చేసి ఆ తర్వాత నోయిడా, బెంగళూరులో ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్లు చెప్పాడు. అయితే ఆ ప్రాపర్టీలను కొనేందుదుకు బ్యాంకుల నుంచి రూ.కోటి రుణంగా పొందిన వ్యక్తి ప్రస్తుతం తన 35వ ఏట రుణాలన్నీ పూర్తిగా చెల్లించేసి ప్రశాంతంగా జీవిస్తున్నట్లు చెప్పాడు. అయితే అతనికి ఉన్న ఆర్థిక క్రమశిక్షణ, సరైన సమయంలో నిర్ణయం తీసుకునే వైనం లైఫ్ లో సెటిల్ అయ్యేలా చేశాయి.

2013లో నోయిడాలో చిన్న ఉద్యోగంతో స్టార్ట్ అయ్యింది ఆ వ్యక్తి కెరీర్. తర్వాత కొన్నాళ్లకు బెంగళూరు వచ్చి టెక్నికల్ కోర్సు చేశాడు. దాదాపు 45 కంపెనీల్లో ఉద్యోగానికి వెళ్లి తిరస్కరణకు గురైన వ్యక్తి ఆ తర్వాత ఒక సీనియర్ హెచ్ఆర్ నుంచి ఆర్థిక పాఠాలు నేర్చుకున్నాడు. ప్రతి నెల ఇంటి అద్దె చెల్లించినట్లు డబ్బు ఖచ్చితంగా దాయటం అలవాటుగా మార్చుకున్నాడు. అలాగే ఆయన చెప్పినట్లుగా క్రెడిట్ కార్డులకు దూరంగా ఉంటూ ప్రతి ఖర్చును అదుపులో పెట్టుకుంటూ వచ్చాడు. 

ALSO READ | దొడ్ల డెయిరీ చేతికి ఓసమ్ డెయిరీ..డీల్ విలువ రూ.271 కోట్లు

తొలుత అతను పన్ను రహిత బ్యాంక్ టర్మ్ డిపాజిట్లలో డబ్బు పెట్టి 8.75 శాతం వరకు వడ్డీని పొందాడు. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులతో 50 శాతం నుంచి 300 శాతం వరకు రాబడిని చూశాడు. ఇలా డబ్బును దాయటం ఒక అలవాటుగా మార్చుకున్న వ్యక్తి తన బోనస్ డబ్బును కూడా ఇన్వెస్ట్ చేసేవాడు. అలా కంపెనీలో వచ్చిన బోనస్ తండ్రి నుంచి తీసుకున్న డబ్బుతో 2018లోనే నోయిడాలో బ్యాంక్ రుణం మీద రూ.60 లక్షలతో ఇల్లు కొన్నాడు. అయితే ఒక్క ఈఎంఐ చెల్లించటంలో విఫలమైనా ఇంటిని అమ్మేయాలని కఠిన నిర్ణయంతో ముందుకెళ్లాడు.

ఈ క్రమంలో ఇంటి ఈఎంఐలు ఏడాదికి రెండు అదనంగా చెల్లిస్తూ వచ్చాడు. అది అతని రుణాన్ని వేగంగా తగ్గించటంతో పాటు, వడ్డీ భారాన్ని తగ్గించింది. అలా అని కుటుంబం, స్నేహితులతో గడపటం మానుకోలేదు సదరు వ్యక్తి. ఆ తర్వాత 2021లో పెళ్లి కాగా.. భార్య కోరిక మేరకు బెంగళూరులో మరో ఇల్లు, కారు రుణంపై కొన్నాడు. అలా వాటిని గడువు కంటే ముందే చెల్లించి ప్రస్తుతం హ్యాపీ లైఫ్ గడుపుతున్నాడు. 

ఈ వ్యక్తి ఆర్థిక ప్రయాణం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలివే..

* ఆర్థిక క్రమశిక్షణను జీవితంలో భాగంగా మార్చుకోవాలి.
* క్రెడిట్ కార్డులను అతిగా వాడటం, అనవసరపు ఖర్చులకు వాడటాన్ని మానుకోవాలి
* ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికీ లెక్కలు ఉండేలా చూసుకోవాలి
* కంపెనీలో వేతనంతో పాటు అప్పుడప్పుడూ వచ్చే బోనస్ మెుత్తాన్ని జాగ్రత్తగా ఉపయోగించేలా ప్లాన్ చేసుకోవాలి
* ఏటా 12 ఈఎంఐలు ఉంటే అదనంగా చెల్లింపులు చేసి త్వరగా రుణాన్ని చెల్లించేయాలి
* ఇంట్లో తినటం, స్థానికంగా షాపింగ్ చేయటం, ప్రయాణాలకు తగిన ప్లానింగ్ చాలా డబ్బు మిగులుస్తుందని గుర్తుంచుకోవాలి
* సరైన ప్రాంతంలో, నిర్మాణ క్వాలిటీ ఉన్న ప్రాపర్టీలను వెతికి కొనుక్కోవటం ఉత్తమం

నేటి యువత ఎంత సంపాదిస్తున్నాం అనే చూస్తున్నారు గానీ దానిలో ఎంత మిగుల్చుకుంటున్నాం అనేది మరచిపోతున్నారు. తొందరికి నెలకు రూ.10 లక్షలు వేతనంగా వచ్చినా సరిపోటం లేదు అనే వ్యక్తులు ఉన్నారు మనచుట్టూ. కానీ డబ్బు ఎప్పుడు సరిగ్గా వినియోగించుకునే వ్యక్తులు, దాచుకునే వ్యక్తుల దగ్గరే ఉంటుందని గుర్తుంచుకోండి.