ఆ వార్తలు నమ్మొద్దు.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది అప్పుడే..

ఆ వార్తలు నమ్మొద్దు.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది అప్పుడే..

కోట్ల మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రాబోతున్న విడత కోసం ఎదురు చూస్తున్న సంగతి మీకు తెలిసిందే. అయితే  ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారం పై వ్యవసాయ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి కిసాన్ పథకానికి సంబంధించిన ఏ సమాచారం కోసం అయిన రైతులు ఎప్పుడు అధికారిక సమాచారంపై మాత్రమే ఆధారపడాలని సూచించింది. అలాగే నకిలీ లింక్‌లు, కాల్స్, మెసేజులకి  దూరంగా ఉండాలని కోరింది.  అంతేకాదు ఈ పథకం 20వ విడత విడుదల, కార్యక్రమం జరిగే తేదీ, స్థలం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

 ఎందుకు ఆలస్యం అవుతోంది: ప్రధానమంత్రి కిసాన్ పథకం 19వ విడత ఈ ఏడాది  ఫిబ్రవరిలో విడుదల కాగా, సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల అవుతుంది, కాబట్టి జూన్‌లో రావాలి. కానీ జూలై 18 వరకు కూడా విడుదల కాలేదు, అయితే ఈ ఆలస్యానికి అధికారిక కారణాలు కూడా వెల్లడికాలేదు. 

ALSO READ : గగన్ యాన్ మిషన్ కు మార్గం సుగమం..శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర

 PM-కిసాన్ స్టేటస్ ఎలా చెక్  చేయాలంటే : ముందుగా https://pmkisan.gov.in ఓపెన్ చేసి 'Know Your Status' పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌  ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పేరు లబ్ధిదారుల లిస్టులో ఉందో లేదో చెక్ చేసి  
అలాగే, మీ eKYC పూర్తయిందా లేదా తెలుసుకోండి. 

 

ప్రధానమంత్రి కిసాన్ పథకం అంటే ఏంటి : 2019లో అప్పటి ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించిన తర్వాత ప్రారంభిన పిఎం కిసాన్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డిబిటి పథకంగా మారింది. దీని కింద అర్హత ఉన్న రైతులకి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి  రూ. 2,000  మొత్తం ఏడాదికి  రూ. 6,000 ఇస్తుంది. ఈ డబ్బు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో పడతాయి. 

PM కిసాన్‌కు ఎవరు అర్హులు: భారతదేశ పౌరుడై ఉండి సొంత సాగు భూమి ఉండాలి. అలాగే చిన్న లేదా సన్నకారు రైతుగా ఉంటూ 
నెలకు రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందకూడదు. అలాగే ఆదాయపు పన్ను ఫైల్  చేయని వారై ఉండాలి.  

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి: మొదట https://pmkisan.gov.in పేజీకి వెళ్లండి, ఇక్కడ 'New Farmer Registration' పై క్లిక్ చేయండి. తరువాత మీ ఆధార్ నంబర్,  క్యాప్చా ఎంటర్ చేయండి, ఎంటర్ చేసాక 'Yes' పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫామ్‌ సబ్మిట్ చేసి  ప్రింటవుట్ తీసుకోండి. అలాగే ఏవైనా సందేహాల ఉంటే  మీరు PM-KISAN హెల్ప్‌లైన్ నంబర్‌లకు 155261 &  011-24300606 కాల్ చేయవచ్చు.