
Gold Price Today: గోల్డ్, సిల్వర్ రేట్లు వారం చివరికి చేరే నాటికి భారీగా పెరుగుదలను నమోదు చేసింది. దీంతో రిటైల్ మార్కెట్లలో దాని ధర విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం బంగారం, వెండి పోటాపోటీగా పెరగటం భారతీయ కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.6వేల భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 170, ముంబైలో రూ.9వేల 170, దిల్లీలో రూ.9వేల 185, కలకత్తాలో రూ.9వేల 170, బెంగళూరులో రూ.9వేల 170, కేరళలో రూ.9వేల 170, పూణేలో రూ.9వేల 170, వడోదరలో రూ.9వేల 175, జైపూరులో రూ.9వేల 185, లక్నోలో రూ.9వేల 185, కోయంబత్తూరులో రూ.9వేల 170, మంగళూరులో రూ.9వేల 170, నాశిక్ లో రూ.9వేల 173, మైసూరులో రూ.9వేల 170, అయోధ్యలో రూ.9వేల 185, నోయిడాలో రూ.9వేల 185, గురుగ్రాములో రూ.9వేల 185 వద్ద ఉన్నాయి.
ALSO READ : సెబీ కీలక నిర్ణయం.. మ్యూచువల్ ఫండ్ల కేటగిరైజేషన్లో మార్పులు
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.6వేల 600 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో శనివారం పెరిగిన రేట్లను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 004, ముంబైలో రూ.10వేల 004, దిల్లీలో రూ.10వేల 019, కలకత్తాలో రూ.10వేల 004, బెంగళూరులో రూ.10వేల 004, కేరళలో రూ.10వేల 004, పూణేలో రూ.10వేల 004, వడోదరలో రూ.10వేల 009, జైపూరులో రూ.10వేల 019, లక్నోలో రూ.10వేల 019, కోయంబత్తూరులో రూ.10వేల 004, మంగళూరులో రూ.10వేల 004, నాశిక్ లో రూ.10వేల 007, మైసూరులో రూ.10వేల 004, అయోధ్యలో రూ.10వేల 019, నోయిడాలో రూ.10వేల 019, గురుగ్రాములో రూ.10వేల 019గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 700 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 400గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2వేల100 పెరిగి నేడు రూ.లక్ష 26వేల వద్ద ఉంది.