ఏడాదిలో వెంకన్నను 2.35 కోట్ల మంది దర్శించుకున్నరు

ఏడాదిలో వెంకన్నను 2.35 కోట్ల మంది దర్శించుకున్నరు

ఈ ఏడాది తిరుమల శ్రీవారిని రికార్డ్ స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. కరోనా రూల్స్  రద్దు చేయడం వల్ల ఈ ఏడాదిలో మొత్తం 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక హుండీ ఆదాయం రూ.1320 కోట్లు వచ్చింది. మొత్తం 1.08 కోట్ల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు అర్పించారు.  11.42 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించామని టీటీడీ వెల్లడించింది.

ఈ ఏడాదిలోనే టీటీడీ మొత్తం ఆస్తుల వివరాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. టీటీడీకి సంబంధించి మొత్తంగా 960 ఆస్తులు ఉన్నాయని .. వాటి విలువ మొత్తం రూ 85,700 కోట్లు అని వెల్లడించారు. బంగారు నిల్వలు, ఆస్తుల వివరాల్లోను దేశంలోనే అత్యధిక ఆదాయం  ఉన్న ఆలయం టీటీడీ.