V6 News

శ్రీ దశమహా విద్యా గణపతిగా ఖైరతాబాద్‌ గణనాథుడు

శ్రీ దశమహా విద్యా గణపతిగా ఖైరతాబాద్‌ గణనాథుడు

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌ మహా గణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రత్యేకత ఉంది. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది ‘శ్రీ దశమహా విద్యా గణపతి’ రూపంలో ఖైరతాబాద్‌ గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వినాయక చవితికి 63 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయనున్నట్టు గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. విగ్రహానికి కుడి వైపు పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి ఉంటారని కమిటీ తెలిపింది.