తొలి ఏకాదశి..భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

తొలి ఏకాదశి..భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. తొలి ఏకాదశి, బక్రీద్ ఒకే రోజు కావడంతో ప్రార్థనలు, పూజలతో నిమగ్నమైపోయారు భక్తులు. మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు ముస్లిం సోదరులు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే దేవాలయాలకు క్యూ కట్టారు. యాదగిరిగుట్ట, బాసర, శ్రీశైలం, వేములవాడ, భద్రాచలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తూ కొంతమంది ఉపవాస దీక్ష ఉంటున్నట్లు తెలిపారు. వర్షం కారణంగా కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని చెప్పారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి పురస్కరించుకుని పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనానికి 24గంటల టైం పడుతుంది. భారీ వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 87వేలకు పైగా మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక హుండీ ఆదాయం 4కోట్ల 53లక్షల రూపాయలు వచ్చినట్లు తెలిపారు టిటిడి అధికారులు.