ఫారిన్​ వెళ్లెటోళ్ల కోసం ఎంటర్​ప్రైజ్​ ఎఫ్​ఎక్స్​ కార్డ్​

ఫారిన్​ వెళ్లెటోళ్ల కోసం ఎంటర్​ప్రైజ్​ ఎఫ్​ఎక్స్​ కార్డ్​

హైదరాబాద్​, వెలుగు : ట్రావెల్​ సొల్యూషన్స్​అందించే థామస్ కుక్ విదేశాల్లో ప్రయాణించే వారి కోసం ఎంటర్​ప్రైజ్​ఎఫ్​ఎక్స్​ కార్డును అందుబాటులోకి తెచ్చింది.  పేమెంట్​అగ్రిగేటర్స్​వీసా, మాస్టర్​కార్డుతో భాగస్వామ్యంతో దీనిని లాంచ్​చేసింది. కార్డును పూర్తిగా  రీసైకిల్ ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌తో తయారు చేశారు.

విదేశాల్లో ఏటీఎం నుంచి దీని ద్వారా ఉచితంగా డబ్బు తీసుకోవచ్చు. పీఓఎస్​ ట్రాన్సాక్షన్లు చేస్తే రివార్డు పాయింట్లు ఇస్తారు. మనదేశంలోని ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్టుల లాంజ్​లను ఉచితంగా వాడుకోవచ్చు.

గ్లోబల్​సిమ్​కార్డును ఉచితంగా ఇస్తారు. కార్డుహోల్డర్​కు రూ.7.50 లక్షల వరకు ఇన్సూరెన్స్, ఎమర్జెన్స్​క్యాష్ అసిస్టెన్స్​ ఉంటాయని థామస్​ కుక్​ ప్రకటించింది.