థామస్ కప్ భారత్ వశమైంది. దీంతో భారత్ ఖాతాలో తొలి థామస్ కప్ జమ అయ్యింది. ఫైనల్ మూడో మ్యాచ్ లో ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టితో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తలపడ్డాడు. తొలి గేమ్ లో శ్రీకాంత్ మంచి ఆటతీరును కనబర్చాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో 21-15 తేడాతో తొలి గేమ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే రెండో గేమ్ (23-21) లో కూడా అదే ఆట తీరును కనబర్చాడు. వరుస రెండు గేమ్ లలో క్రిస్టీని ఓడించాడు. భారత ఆటగాళ్లు అద్భుత తీరును కనబర్చడంతో ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయాన్ని నమోదు చేశారు.
ఐదు మ్యాచ్ లు ఆడగా.. మూడింటిలో విజయం సాధించారు. దీంతో థామస్ కప్ భారత్ వశమైంది. లక్ష్యసేన్ తన మొదటి గేమ్ లో 8-21, 21-17, 21-16తో అంథోనీ గింటింగ్ ను ఓడించాడు. సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడి.. అహ్సన్ - కెవిన్ (డబుల్స్ మ్యాచ్) లపై 18-21, 23-21, 21-19తో గెలిచారు. అనంతరం ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టితో జరిగిన మ్యచ్ లో 21-15, 23-21తో కిదాంబి శ్రీకాంత్ గెలుపొందాడు. 14 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఇండోనేషియాను ఓడించిన భారత టీంపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మ్యాచ్ గెలిచిన అనంతరం భారత షట్లర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
SPEECHLESS ? YOU GUYS HAVE MADE IT!!
— Ishu Rajput (@Ishuu_Rajput) May 15, 2022
A Big bow to our Thomas Cup team as they Scripts History after claiming their maiden #ThomasCup title after 7️⃣3️⃣ years. @srikidambi does the job defeating J.Christie (21-15, 23-21) in the 3rd tie.
@bwfmedia @BadmintonTalk #ThomasCup2022 pic.twitter.com/r3bF7nnmW9
మరిన్ని వార్ల కోసం :
కోలుకున్న పృథ్వీ షా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
రోడ్డు ప్రమాదంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మృతి

