- తొర్రూరు హైస్కూల్ లో అత్యధికంగా 16 మంది టీచర్లు ఎక్కువ
- రాజులకొత్తపల్లిలో 5 గురు విద్యార్థులకు 9 మంది టీచర్లు
- కొన్ని ప్రభుత్వ స్కూల్స్లో నేటికి ఉపాధ్యాయులు కొరత
- జిల్లాల పరిధిలో వర్క్ అడ్జెస్ట్మెంట్ వెంటనే చేయాలని ఆదేశాలు
మహబూబాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గత నెల30న ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్యను అంచనా వేస్తూ, సర్ ప్లస్ ఉన్నారా, తక్కువగా ఉన్నారా అనే లెక్కలను తేల్చారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో రాష్ట్రంలో రెండో స్ధానంలో16 మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు.
మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల కొరత వేధిస్తూనే ఉంది. దీంతో ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్ల అనుమతితో తక్షణం వర్క్ అడ్జెస్ట్మెంట్ చేయాలని అధికారులు సన్నాహకాలను కొనసాగిస్తున్నారు.
పాఠశాలల వారీగా డేటా సేకరణ..
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్విభాగాల్లో 19 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 21 మంది నుంచి 60 వరకు విద్యార్థులు దాటితే ఇద్దరు ఉపాధ్యాయులు, పిల్లల సంఖ్య 90 వరకు ఉంటే ముగ్గురు, ఆపై ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని నిర్ణయించారు. ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు లాంగ్వేజ్ పండిట్లు, ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హై స్కూల్ విభాగంలో పది మంది విద్యార్థులున్నా, కనీసం 9 మంది టీచర్లు ఉండాలనే నిబంధన విధించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు కంటే ఎక్కువగా టీచర్లు ఉన్న హైస్కూల్స్ వివరాలు
మహబూబాబాద్ జిల్లాలో జడ్పీ హైస్కూల్ తొర్రూరు 16 మంది, దంతాలపల్లి14, డోర్నకల్11, కేసముద్రం11, నరసింహులపేట 11, మరిపెడ11, కురవి10, మహబూబాబాద్9, బయ్యారం మండలం జీకే పేట 8, గూడూరు మండలం అయోధ్యాపురం 8, గూడూరు 8, కేసముద్రం మండలం కల్వాల 8, మరిపెడ మండలం సీతరాంపురం 8, కంబాలపల్లి 7, నెల్లికుదురు 7, మునిగలవీడు 7, పెద్దవంగర 7, కాంపల్లి 7, పొగుళ్లపల్లి 6, కన్నెగుండ్ల 6, రాజోలు 6, మొదుగులగూడెం 6, ఈదులపూసపల్లి 6, పెనుగొండ 6, ఆలేరు 6, నెల్లికుదురు 6, హరిపిరాల 6, ఇనుగుర్తి 6, బయ్యారం బాయ్స్ 5, ములుకలపల్లి 5, మొదుగులగూడెం 5, చిన్నగూడూరు 5, దంతాలపల్లి 5, అమ్మాపురంలో ఐదుగురు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వరంగల్జిల్లాలో పర్వతగిరి 13, గీసుకొండ మండలం ధర్మారం 10, మొండ్రాయి 6, మామునూరుక్యాంప్6, శంభునిపేట 6, శివనగర్ 6, ఉర్స్ 6, హసన్‌పర్తి గర్ల్స్6, నారాయణగిరి 6, హసన్పర్తిగౌట్ స్కూల్ 6, మండిబజార్ 6, మొగిలిచర్ల 5, దుగ్గొండి 5, మల్లంపల్లి 5, ఇటుకాలపెల్లి 5, నర్సంపేట్ పాకాల 5, మట్వాడ 5, ఉప్పరపల్లి 5, ఇల్లంద 5, కొత్తూరు 5, సూరుపెల్లి 5, నెక్కొండ 5, పైడిపల్లి ఐదుగురు ఎక్కువగా ఉన్నారు.
జనగామ జిల్లాలో శివునిపల్లిలో 12, పాలకుర్తి 9, చిల్పూరు మండలం కమలాపూర్8, జనగామ మండలం దమరంచలో 8, తరిగొప్పుల 7, ఇప్పగూడెం 7, బచ్చన్నపేట 7, కోర్టుజంక్షన్ 7, చిన్నమడూరు 7, కూనురు 6, తాటికొండ 6, స్టేషన్‌ఘన్‌పూర్6, కిలాషపూర్6, పద్మావతి కేశవపూర్6, గూడూరు 6, కొడకండ్ల 6, చాగల్ 5, ఇప్పగూడెం 5, పోచన్నపేట 5, నవాబ్‌పేట 5, చెన్నూరు 5 ఉన్నారు.
ములుగు జిల్లాలో గోవిందరావుపేట మండలం పస్రాలో 9, మంగపేట మండలంరాజుపేట 8, ఏటూరునాగారం 8, వెంకటాపురం 6, మంగపేట 6, మల్లంపల్లి 5, చల్వాయి 5, తిమ్మంపేట 5 మంది ఎక్కువగా ఉన్నారు.
జయశంకర్భూపాలపల్లి జిల్లాలో జంగేడు10, తాడిచెర్ల 7, చిల్పూరు 7, మాధవాపూర్6, చిట్యాల6, మహదేవ్పూర్5, గొర్లవీడు 5, గొల్లబుద్దారం 5, భూపాలపల్లి05 ఉన్నారు.
హనుమకొండ జిల్లాలో దామెర 7, వేలేరు 7, ఆత్మకూరు 5, మల్లికుదుర్ల 5, కమలాపూర్5, తరాల్లపల్లి 5, లష్కర్‌బజార్5, పంథిని5 మంది టీచర్లు ఎక్కువగా ఉన్నారు.
ఐదుగురు విద్యార్థులు., 9 మంది టీచర్లు..
మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో మొత్తంగా ఐదుగురు విద్యార్థులకు 9 మంది టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి హైస్కూల్ లో మినిమం క్యాడర్ స్ట్రెంత్ 9 మంది ఉండాల్సిందేననే నిబంధనలు ఉండటంతో ఇక్కడి టీచర్లకు బదిలీ లేనట్లననే చర్చ జరుగుతుంది. విద్యార్థుల సంఖ్య కంటే టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా, అలాగే కొనసాగించడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తక్షణం అవసరమున్న చోట అడ్జెస్ట్మెంట్ చేస్తాం..
రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్యకంటే ఎక్కువగా ఉన్న టీచర్ల సంఖ్యను గుర్తించాం. రాష్ట్రంలోనే తొర్రూరు ఉన్నత పాఠశాలలో అత్యధికంగా 16 మంది టీచర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని కలెక్టర్ ఆదేశాలతో ప్రతి నెల రిటైర్మెంట్తో ఏర్పడిన ఖాళీలు, లాంగ్ లీవ్ పెట్టిన వారి స్థానంలో సర్ప్లెస్ ఉన్న స్కూల్స్ నుంచి టీచర్లను అవసరమున్న ప్రభుత్వ స్కూల్స్‌కు పంపించనున్నాం. ఎటువంటి విమర్శలకు తావు లేకుండా డిప్యూటేషన్లను కేటాయించాం. విద్యార్థుల అకాడమిక్ ఇయర్‌కు ఇబ్బంది లేకుండా తగిన చర్యలను చేపడుతాం. దక్షిణమూర్తి, డీఈవో, మహబూబాబాద్ జిల్లా
