ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అగ్రగామి నిలుపుతున్నది ఎవరు? మాయ మాటలు చెబుతూ రాజకీయాలు చేస్తున్నది ఎవరో? ప్రజలు గుర్తించాలని మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం సికింద్రాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.8.40 కోట్లతో నిర్మించిన 10 వేల మెట్రిక్ టన్నుల గోడౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో గతంలో ఒక్క టన్ను నిల్వ చేసుకునే గోడౌన్ కూడా లేదని, సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చొరవతో నేడు 25.40 కోట్ల  టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం గల గోడౌన్లు నిర్మించుకున్నామని తెలిపారు. కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి 7 ఏళ్లలో 3 రెట్లు పెరిగిందన్నారు. కేసీఆర్ తలపెట్టిన ఏ సంక్షేమ పథకమైనా  10 తరాల పాటు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా రూపకల్పన చేశారన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉందన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని చెప్పారు. ఇంత చేస్తున్న కొంత మంది మాయమాటలతో ప్రజలను గందరగోళాన్ని సృష్టిస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దేవుడి పేరు మీద రాజకీయాలు చేస్తున్న వారి అబద్ధపు ప్రచారాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

కేజీ వీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లపై తిప్పితే కేసులే

భిక్కనూరు, వెలుగు: కేజీవీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రోడ్లపై తిప్పితే కేసులు తప్పవని ఎస్సై గాంధీగౌడ్ హెచ్చరించారు. మంగళవారం సర్పంచ్ తునికి వేణు, విండో చైర్మన్ గంగల భూమయ్యతో కలిసి ఆయన మండల కేంద్రంలోని కేజీవీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాక్టర్ల డ్రైవర్లు, ఓనర్లతో మాట్లాడారు. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభమైనందున రైతుల పొలాలు దున్నేందుకు ట్రాక్టర్లకు కేజీవీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిట్​చేసుకుని వెళ్లడం వల్ల రోడ్లు దెబ్బ తింటున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉందని, ఎవరైనా కేజీవీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లపై తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

బీజేపీ గ్రామస్థాయిలో బలపడింది

ఎల్లారెడ్డి, వెలుగు: బీజేపీకి ప్రతి ఒక్కరూ సహకారం అందించడం వల్లే గ్రామస్థాయిలో బలపడిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డి టౌన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన నియోజకవర్గ, శక్తి కేంద్ర, బూత్‌‌‌‌‌‌‌‌ స్థాయి మీటింగ్స్‌‌‌‌‌‌‌‌కు ఆయన చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌గా హాజరై మాట్లాడారు. ఈ నెల 7న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 119 నియోజకవర్గంలోని బీజేపీ శక్తి కేంద్రం, బూత్ స్థాయి సభ్యులతో వర్చువల్‌‌ మీటింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఎల్లారెడ్డి టౌన్ ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ స్కీంలను గ్రామ స్థాయిలో ప్రచారం చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి లీడర్లు పైలా కృష్ణారెడ్డి, బాపురెడ్డి, దేవేందర్ పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్లను తిరిగి ప్రారంభించాలి

బోధన్, వెలుగు: బోధన్ పట్టణంలోని శక్కర్​నగర్, గాంధీపార్క్, ఎడపల్లి మండలంలో రద్దు చేసిన రైల్వే స్టేషన్లను తిరిగి ప్రారంభించాలని అఖిల భారత్ రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్డీవో ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి ఏవో ముంతాజుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా నాయకుడు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్లు ఎత్తివేడయంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. స్టేషన్లను పునఃప్రారంభించాలని ఇప్పటికే ఎడపల్లిలో ఒక రోజు దీక్ష చేశామని, బోధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైల్వేస్టేషన్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం నాయకులు షేక్ నసీర్, శ్రీపతి మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుదర్శన్, హన్మండ్లు, సిద్ద పోశెట్టి, చిన్న పోశెట్టి, గంగాధర్, వైద్యనాథ్​ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న టీఎల్ఎం ప్రదర్శన

పిట్లం, వెలుగు: పిట్లం బాయ్స్​హైస్కూల్‌‌‌‌లో టీచింగ్ లెర్నింగ్ మెథడ్  ప్రదర్శన నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ప్రదర్శనను ఎంపీపీ కవితావిజయ్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీచర్లు తెలుగు, ఇంగ్లిష్​, మ్యాథ్స్‌‌‌‌, సోషల్​ పాఠ్యాంశాలకు సంబంధించి బోధనోపకరణాలు ప్రదర్శించారు. ఎంఈవో దేవీసింగ్ మాట్లాడుతూ బోధనోపకరణాలు స్టూడెంట్లకు  ఎంతో ఉపయోగపడతాయన్నారు. ముగింపు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీచర్లకు బహుమతులు అందించి జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో సర్పంచ్​ విజయలక్ష్మి, తహసీల్దార్​రామ్మోహన్‌‌‌‌రావు, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, నోడల్ ఆపీసర్ విఠల్, కాంప్లెక్స్​ నోడల్ ఆఫీసర్లు గణేశ్‌‌‌‌రావు, శ్రీనివాస్, హెంసింగ్, హెడ్మాస్టర్లు వేదశ్రీ, హరిసింగ్, సీఆర్పీలు గోపాల్, హైమద్​పాషా పాల్గొన్నారు.

డాంబర్ ప్లాంట్ వద్దని ఆందోళన

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ పక్కన ఏర్పాటు చేస్తున్న డాంబర్​ ప్లాంట్‌‌‌‌ ఎత్తివేయాలంటూ జీఆర్ కాలనీ, హౌజింగ్ బోర్డు కాలనీ వాసులు  బుధవారం  రాస్తారోకో చేపట్టారు. డాంబర్ ప్లాంట్ ఏర్పాటుతో  పొల్యూషన్‌‌‌‌ ఎక్కువై ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. జనావాసాల మధ్య ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్లాంట్‌‌‌‌ ఓనర్ వచ్చి డాంబర్ ప్లాంట్ ఏర్పాటు చేయనని స్థానికులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.