ఒక్క ఉద్యోగం కోసం.. వేలమంది ఎగబడ్డారు

ఒక్క  ఉద్యోగం కోసం.. వేలమంది ఎగబడ్డారు

ఒకే ఒక్క ఉద్యోగం.. వేలాది మంది అభ్యర్థులు..ఉద్యోగం కోసం వచ్చిన వారితో కంపెనీ ఆవరణ మొత్తం నిండిపోయింది. రెజ్యూమ్ లు చేత బట్టుకొని ఈ ఉద్యోగం నాకే రావాలి అని మనసులో కోరుకుంటూ అప్లయ్ చేస్తున్నారు. ఇటీవల పుణేలోని హింజేవాడిలో కాగ్నిజెంట్ వాక్ ఇన్ డ్రైవ్ లో అధిక సంఖ్యలో అభ్యర్థులు ఒకే ఉద్యోగ ఖాళీ కోసం దరఖాస్తులు చేస్తున్నపుడు తీసిని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఒకే ఒక్క ఉద్యోగం ఏంటీ వివరాలు తెలుసుకుందాం. 

ఇన్స్ట్రాగ్రామ్లో  ఈ వీడియోను  పోస్ట్ చేశారు. పుణేలోని హింజేవాడిలో కాగ్నిజెంట్ వాక్ ఇన్ డ్రైవ్ కు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేశారు. రెజ్యూమ్  హార్డ్ కాపీలు చేత పట్టుకొని అప్లయ్ చేసేందుకు వేచి వున్న అభ్యర్థులు ఇందులో కనిపిస్తున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ ఏమిలో తెలుసా.. జూనియర్ డెవలపర్.. ఈ పోస్ట్ కోసం 2900 లకు పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు నిరుద్యోగులు దీన స్థితిని చూసి చాలా బాధపడ్డారు. సానుభూతి చూపించారు. ‘‘ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల వాస్తవమైన దీనస్థితి ఇది ’’ అని పోస్ట్ చేశాడు. అత్యధిక మ్యాన్ పవర్ ఉన్న భారత దేశంలో నిరుద్యోగ రేటు హెచ్చు తగ్గులు దేశ అభివృద్దిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కొందరు నెటిజన్లు. అంతే కాదు.. నిరుద్యోగం భారత దేశంలో ప్రధాన సమస్యగా మిగిలి ఉంది.. దేశ ఆర్థిక రంగానికి సవాళ్ళను విసురుతుందని మరొ నెటిజన్ రాశారు. 

బ్లూమ్ బెర్గ్ ప్రకారం.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE)  డేటా ఆధారంగా అక్టోబర్ 2023లో భారత దేశ నిరుద్యోగిత రేటు రెండేళ్ల గరిష్ట స్థాయి 10.09 శాతానికి పెరిగింది. జూలై-సెప్టెంబర్ కాలంలో దేశంలో అత్యధిక నిరుద్యోగిత రేటు నమోదుకు దీర్ఘకాలిక ప్రభావం చూపిన కోవిడ్ వంటి పాండమిక్ కారణమైంది.