జామా మసీదులో ఘనంగా రంజాన్ వేడుకలు

 జామా మసీదులో ఘనంగా రంజాన్ వేడుకలు

దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు వివిధ మసీదులలో నమాజ్  నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ముస్లిం సోదరులు. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత నిన్న ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో దేశంలో పలు ప్రాంతాల్లో రంజాన్ వేడుకులు జరుపుకుంటున్నారు. 

ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపూర్  మసీదు ఇమామ్ లు చంద్రుని దర్శనాన్ని ధృవీకరించారు. చంద్రుడిని చూసిన తర్వాత ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని. ఫోన్, వాట్సాప్, ఎస్ ఎంఎస్ ల ద్వారా  ఈద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.  ఈద్ కోసం  పెర్ఫ్యూమ్, క్యాప్స్, డ్రై ఫ్రూట్స్  పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు ముస్లిం సోదరులు. పాత ఢిల్లీతో పాటు, జామియా నగర్, సీలంపూర్, జాఫ్రాబాద్, నిజాముద్దీన్ సహా ఇతర మార్కెట్లలో రద్దీ పెరిగింది. ఈద్  వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.