40 ఏండ్ల నాటి వేల పెన్నులు

40 ఏండ్ల నాటి  వేల పెన్నులు

ఆ కాలం లో ఎవరైనా గల్ఫ్ నుండి వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలంటే వాచ్, టార్చ్ లైట్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావాలని కోరుతారు.. ఇలా ఎవరైన ఏలాంటి గిఫ్ట్ కావాలని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కలం కావాలని అడుగుతాడు ఆ పట్వారీ... 

జగిత్యాలకు చెందిన శ్రీధర గోపాల రామయ్య 1978 నుండి 2000 సంవత్సరం వరకు జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామానికి  పట్వారిగా పని చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ అయి.. 2019 లో మృతి చెందాడు. మూడేళ్ల క్రితం మరణించిన తన తండ్రి ట్రంక్ పెట్టె ఓపెన్ చేయగానే 40 ఏళ్లుగా దాచుకున్న కొన్ని వేల  పెన్నులు దర్శనమిచ్చాయని కొడుకు గణపతి శర్మ చెప్పారు. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ లో షేర్ చేసుకోవడంతో ఓ ప్రవేట్ స్కూల్ యాజమన్యం కంప్యూటర్ యుగంలో స్టూడెంట్ కు కలం విలువ తెలిసేలా సందర్శన కోసం 40 ఏళ్ల చరిత్ర కలిగిన పెన్నులను ఇవ్వాలని కుటుంబ సభ్యులను కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.