పోలీసులమని బెదిరించి.. లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూల్

పోలీసులమని బెదిరించి.. లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూల్

ముగ్గురు నకిలీ పోలీసులను అరెస్ట్ చేసిన కోదాడ పట్టణ పోలీసులు

కోదాడ, వెలుగు : పోలీసులమంటూ లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయికి చెందిన లారీ డ్రైవర్‌‌‌‌‌‌‌‌ గత నెల 29న మేళ్లచెర్వులో సిమెంట్ లోడు చేసుకొని వెళ్తున్నాడు. అతడు కోదాడ పట్టణంలోని గుడిబండ ఫ్లై ఓవర్‌‌‌‌ ‌‌‌‌వద్దకు చేరుకోగానే ఏపీ 11 ఏజే 0859 నంబర్ గల కారులో తుమాటి భరత్‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, పసుపులేటి రాము, షేక్‌‌‌‌ ‌‌‌‌బడేమియా అనే వ్యక్తులు వచ్చి లారీని అడ్డగించారు. తాము పోలీసులమంటూ బెదిరించి డబ్బులు లాక్కెళ్లారు. అనుమానం వచ్చిన లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభిం చిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు తూ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.