ఆస్ట్రేలియాలో కూలిన కెనడా విమానం…ముగ్గురి మృతి

ఆస్ట్రేలియాలో కూలిన కెనడా విమానం…ముగ్గురి మృతి

గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు మంటలను అదుపు చేసేందుకు వచ్చిన కెనడా విమానం గురువారం కూలిపోయింది. అల్పైన్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన వారంతా అమెరికన్‌ పౌరులేనని చెప్పారు. విమానం కూలిపోయిన ఘటనపై తమకు వెంటనే సమాచారం అందలేదన్నారు. మొనారో మంచు ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో బతికి బయటపడలేదన్నారు. కార్చిచ్చు మంటలను అదుపు చేసేందుకు పూర్తి స్థాయిలో నీటిని నింపుకున్న ఈ వాటర్‌ ట్యాంకర్‌ విమానం కూలిపోయినపుడు భూతలంపై తీవ్ర ప్రభావమే చూపిందని చెప్పారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.