
నందిపేట, వెలుగు: నందిపేటలోని వివేకానంద చౌరస్తాలో బుధవారం పోలీసులు మూడున్నర కిలోల గంజాయి పట్టుకున్నారు. చౌరస్తా వద్ద వెహికల్స్ చెకింగ్ చేస్తుండగా నిజామాబాద్గౌతమ్నగర్ కు చెందిన జీలకర్ర ప్రసాద్, విద్యాసాగర్ అనుమానాస్పదంగా కనిపించారు.వారి వద్ద తనిఖీ చేయగా గంజాయి దొరికింది. నిందితులను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్ఐ రాహుల్ తెలిపారు. గతేడాది కూడా నందిపేటలో భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అధికారులు కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.