
- ముగ్గురు అరెస్ట్, పరారీలో10 మంది
- 8 సెల్ ఫోన్లు, 5 బైకులు, రూ.3 లక్షల 29 వేల నగదు స్వాధీనం
వెల్దుర్తి, వెలుగు: జూదం స్థావరంపై ఆదివారం పోలీసుల దాడులు నిర్వహించినట్లు సీఐ రంగా కృష్ణాగౌడ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వెల్దుర్తి మండల పరిధిలోని దామరంచ అడవి ప్రాంతంలో కొందరు వ్యక్తులు హెడ్స్ అండ్ టేల్స్ ఆట ఆడుతున్నట్లు ఎస్ఐ రాజుకి సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి దాడులు నిర్వహించారు.
అక్కడ జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరో 10 మంది పారిపోయారు. సంఘటనా స్థలం వద్ద లభించిన 5 బైకులు, 8 సెల్ ఫోన్లు, రూ.3 లక్షల 29 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.