
- 200 గ్రాముల గంజాయి, 3 మొబైల్స్ స్వాధీనం
హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ పట్టణంలోని మహ్మదాపూర్ రోడ్డులో గంజాయి తాగుతూ, అమ్మేందుకు యత్నిస్తున్న ముగ్గురు యువకులను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, హుస్నాబాద్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. సీఐ కొండ్ర శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడిన వారిలో పట్టణానికి చెందిన చుక్క అనిల్, బూర్ల రాకేశ్, మదన అభినయ్ ఉన్నారు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిబ్బందితో కలిసి దాడి చేసి వారిని పట్టుకున్నారని చెప్పారు.
కరీంనగర్‌కు చెందిన వంశీ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు ముగ్గురు అంగీకరించినట్లు తెలిపారు. వంశీ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి 200 గ్రాముల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.